గౌతమ్ వాసుదేవ్ మేనన్ అలియాస్ గౌతమ్ మేనన్ అందమైన ప్రేమకథలను తెరకెక్కించడం లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని తెచుకున్న దర్శకుడు. తను దర్శకత్వం చేసిన ఏం మాయ చేసావే సినిమాతో ప్రేక్షకులను నిజంగానే మాయచేసాడు. ఒక్క లవ్ స్టోరీస్ లోనే కాదు యాక్షన్ సినిమాలతోను ఆకట్టుకున్నాడు గౌతమ్ మీనన్. ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించిన గౌతమ్ మీనన్ పుట్టినరోజు నేడు.
1973, ఫిబ్రవరి 25న కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ సమీపంలోని ఒట్టపాళెంలో జన్మించిన గౌతమ్ మేనన్. తండ్రి మరణానంతరం చెన్నై వచ్చి స్థిరపడ్డారు. అన్నానగర్‌లో ఆయన పెరిగారు. మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ హైయ్యర్ సెకండరీ స్కూల్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన మూకాంబికై కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో మెకానికల్ ఇంజనీరింగ్‌లో పట్టా పుచ్చుకున్నారు.
ఆ తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టిన గౌతమ్ మేనన్ తీసిన తొలి చిత్రం ‘మిన్నలే’. ఆ తర్వాత 2008లో ‘వారణం ఆయిరం’, 2010లో ‘విన్నైతాండి వరువాయా’, 2013లో ‘ఖాకా ఖాకా’, 2006లో ‘వేట్టైయాడు విలైయాడు’, 2015లో ‘యన్నై అరిందాల్’ వంటి సూపర్ హిట్ చిత్రాలున్నాయి. ‘వారణం అయిరం’ చిత్రం జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. అలాగే, ఈయన 2013లో సొంతగా నిర్మించిన ‘తంగ మీన్‌గళ్’ చిత్రం బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో నేషనల్ ఫిల్మ్ అవార్డు గెలుచుకుంది. ఒక్క తమిళంలోనే కాకుండా తెలుగు, హిందీ భాషల్లో కూడా ఈయన చిత్రాలు నిర్మించారు. ఆయన డైరెక్ట్ చేసిన మూవీస్ లో అన్ని మ్యాజికల్ మూమెంట్స్ ఉంటాయి.మాములుగా సినిమాలలో హీరోయిన్స్ అందంగా కనిపిస్తారు కాని తన ప్రతి సినిమాలలోను హీరోయిన్స్ మరింత అందంతో పాటు వారి పాత్రల పేర్లు కుడా ప్రేక్షకులను ప్రేమలో పడేలా చేస్తాయి ఆయన సినిమాలు.
తనుచేసిన చెలి సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు తమ చెలి కోసం వెతకడం మొదలుపెట్టారు. విక్టరి వెంకటేష్ అసిన్ తో చేసిన ఘర్షణతో మాయ అనే క్యారెక్టర్ తో ఆడియన్స్ గుండెల్లో ఘర్షణ పుట్టించారు. సూరియ తో చేసిన సూర్య s/o కృష్ణన్ మూవీ మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఇక సమంతను పరిచయం చేస్తూ నాగ చైతన్యతో చేసిన ఏమాయ చేశావే సినిమాతో తెలుగు, తమిళ ఆడియన్స్ ను మాయచేశారు. ఈ సినిమాను తెలుగు, తమిళ్ మరియు హింది మూడు భాషల్లోనూ తనే డైరెక్ట్ ఓ చేయడం వేశేషం. సాహసం శ్వాసగా సాగిపో సినిమాతో కుర్రాళ్ళు తలచుకుంటే ఏమైనా సాధించగలరు అని నిరూపించాడు. ఇలా తనకంటూ ఓ యునిక్ స్టైలిష్ మూవీస్ ను డైరెక్ట్ చేసిన గౌతమ్ మీనన్ ఫిలింఫేర్ & నంది అవార్డ్ తోపాటు నేషనల్ అవార్డ్ ను కుడా అందుకున్నారు. స్క్రీన్ రైటర్‌గా, నేపథ్య గాయకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ఆయన రాణించారు.
ఇటీవల కొత్త టర్న్ తీసుకుని దర్శకత్వంతో పాటు పలు సినిమాల్లో & వెబ్ సిరీస్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పాత్రలు చేసి ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇలా తెరపై వైవిధ్యమైన పాత్రలతో పాటు తనదైన ముద్రగల ప్రేమకథలను & యాక్షన్ సినిమాలతో ఆడియన్స్ ను అలరింస్తూ సక్సెస్ఫుల్ గా తన జర్నీ ఉండాలని కోరుకుంటూ బర్త్డే విషేష్ తెలుపుతుంది మూవీ వాల్యూం.