తనకోసం పోరాడే వాడు హీరో కాదు.. తనను నమ్ముకున్నవాళ్లకోసం పోరాడే వాడే అసలైన హీరో.. ఇది ఇండియన్‌ కమర్షియల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్స్‌ కు జాతీయ గీతం లాంటి డైలాగ్‌. ఇలాంటి లైన్‌కు టైగర్‌ ష్రాఫ్ హీరోతో ఎలివేషన్‌ ఇస్తే ఎలా ఉంటుందో ప్రూవ్ చేస్తోంది గణపథ్‌ ట్రైలర్‌. డాషింగ్ గ్లామర్‌ క్వీన్‌ కృతిసనన్ టైగర్‌ష్రాఫ్ కు తోడైతే యాక్షన్‌ విన్యాసాలకు కొదవే ఉండదు..

గణపథ్‌ ట్రైలర్‌ అంతా టిమ్‌ మ్యాన్‌, విక్రమ్‌ దహియా.. యాక్షన్ కొరియోగ్రఫీ విశ్వరూపంతో నిండిపోయి.. ఓ సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించింది. బిగ్‌బి అమితాభ్ స్క్రీన్‌ ప్రజెన్స్‌ సూపర్బ్‌. సలీమ్‌ సులేమాన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్ కు గూస్‌బంప్స్ అంతే. సుధాకర్‌రెడ్డి సినిమాటోగ్రఫీ హాలీవుడ్ స్టాండర్డ్స్‌కు తగ్గట్టు ఉంది. ఈ సుధాకర్‌ రెడ్డి మన తెలుగోడే. గుంటూరు వాసి.

 

ఇక టెక్నికల్‌ స్టాండర్డ్స్‌, క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా నిర్మించాడు జాకీ భగ్నాని. గణపథ్‌ ట్రైలర్ కు, ఫస్ట్ సాంగ్ కు వస్తున్న ఈ పాజిటివ్ రెస్పాన్స్ చూస్తుంటే పడ్డ కష్టం అంతా మర్చిపోయి, ప్రేక్షకుల అంచనాలు అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు నిర్మాత జాకీ భగ్నాని. వికాస్‌ బాల్ టేకింగ్ డైరెక్షన్‌ ఓ కొత్త ప్రపంచాన్నే సృష్టించినట్టుగా ఉంది.ఓవరాల్‌గా గణపథ్‌ ట్రైలర్ యాక్షన్‌ ప్రియులకు కనువిందే. ఈ సినిమా అక్టోబర్ 20న విడుదల కాబోతుంది.

Leave a comment

error: Content is protected !!