Gamechanger movie : మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబో లో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ రాజకీయ థ్రిల్లర్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుండగా, యస్.యస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.

లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ప్రకారం, ‘గేమ్ ఛేంజర్’ చిత్రానికి సంబంధించిన చిన్న షెడ్యూల్ రేపు ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణం పాల్గొంటుంది.  ఈ సినిమాలో ఇంకా.. శ్రీకాంత్, అంజలి, నవీన్ చంద్ర, సునీల్, జయరాం, సముద్రఖని, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తుండగా, ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్ లో 15వ సినిమా కాగా, దిల్ రాజు ప్రొడక్షన్స్ లో 50వ సినిమా కావడం విశేషం.

Leave a comment

error: Content is protected !!