ధియేటర్లో సీట్లో కూర్చున్న సినీ ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేయాలంటే కథలో దమ్ము హీరో విలన్ల మధ్య గేమ్ పర్‌ఫెక్ట్‌గా ఉండాలి. ఇదే కమర్షియల్ సినిమా ఈక్వేషన్. ఇప్పుడు రోజులు మారాయి పెద్ద హీరోలు చేస్తేనే కమర్షియల్ సినిమా అంటే అని అనుకునే రోజులనుంచి కొత్తవాళ్లయినా కమర్షియల్ ఎలిమెంట్స్ తో గేమ్ ఆన్ అయి స్క్రీన్‌ప్లే పర్‌ఫెక్ట్‌గా ప్లే అయితే చాలు కమర్షియల్‌గా వర్కవుట్ అవుతుందని చాలా సినిమాలు ప్రూవ్ చేస్తున్నాయి. అలాంటి సినిమానే గేమ్ ఆన్ అంటున్నారు. కస్తూరి క్రియేషన్స్ ప్రొడక్షన్స్, గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ సంయుక్తంగా దయానంద్ దర్శకత్వంలో వస్తున్న మూవీనే ‘గేమ్ ఆన్’. ఈ చిత్రంలో గీత్ ఆనంద్, నేహా సోలంకి జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి రిచో రిచ్ అనే లిరిక్స్‌తో ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేసారు.
ఈ సాంగ్‌ను అసుర రాసిన లిరిక్స్‌కు రిక్కీ.బి, అసుర లు గానం చేస్తే.. ర్యాప్ స్టైల్లో నవాబ్ గ్యాంగ్ అద్భుతంగా ట్యూన్ చేసింది. నవాబ్ గ్యాంగ్ మ్యూజిక్ ఈ చిత్రానికి హైలైట్ అంటున్నారు. ఇంటెన్స్ క్యారెక్టర్స్ మధ్య జరిగే ఎమోషనల్ జర్నీ ఇది. హీరో ఒక లూజర్ గా తన లైఫ్ లో మిగిలిపోతున్న టైమ్‌లో తన లైఫ్‌లో ఒక గేమ్ స్టార్ట్ అవుతుంది. తనని ఆ గేమ్ ఏ లెవల్‌కు తీసుకెళుతుందనేదే ఈ కథ. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉందంటున్నారు. రొటీన్ కు భిన్నంగా సాగే కథ కథనాలతో గేమ్ ఆన్ చిత్రం రూపొందింది అంటున్నారు చిత్ర దర్శకుడు దయానంద్. రిచో రిచ్ సాంగ్ ను హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదములు”తెలిపింది చిత్ర యూనిట్.