కస్తూరి క్రియేషన్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై రవి కస్తూరి నిర్మించిన మొదటి చిత్రం గేమ్ ఆన్. గీతానంద్, నేహా సోలంకి జంటగా నటించిన ఈ చిత్రానికి దయానంద్ దర్శకత్వం వహించారు. సీనియర్ నటులు మధుబాల, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత రవి కస్తూరి సినిమా గురించి చెప్పిన విశేషాలు.
“కాలేజీలో చదువుతున్నప్పటి నుంచే సినిమాలపై ఇంట్రెస్ట్ ఉండేది. గీతానంద్ హీరోగా, నేను నిర్మాతగా సినిమా చేయాలనుకున్నాం. ఇప్పుడు మంచి కథ సెట్ అవ్వడంతో ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేశాం. ప్రీ ప్రొడక్షన్ కి టైం ఎక్కువ కేటాయించి అంతా పర్ఫెక్ట్ గా ఉండేలా ప్లాన్ చేసుకున్నాం.ఈ జర్నీలో చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. రియల్ టైం సాగే కథకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించాం. యాక్షన్, ఎమోషన్ తో పాటు ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటుంది. జీవితాన్ని చాలించాలనుకునే ఓ వ్యక్తి దాన్ని ఎలా అధిగమించాడు అనేది గేమ్ థీమ్ లో చూపించాం. సినిమా ప్రారంభం నుంచి కాన్ఫిడెంట్ గానే ఉన్నాం. నిర్మాతగా ఈ సినిమా నుంచి సహనంగా ఉండాలని నేర్చుకున్నా అన్నారు నిర్మాత రవి.
ఈ సినిమా ఎక్స్పీరియన్స్ నాకు మరో పది సినిమాలకు ఉపయోగపడుతుంది. ఇప్పటికే రెండు కథలు విన్నాను. ఈ సినిమా రిలీజ్ అయ్యాక వాటిని అనౌన్స్ చేస్తాం” అని చెప్పారు.