కస్తూరి క్రియేషన్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై రవి కస్తూరి నిర్మించిన చిత్రం గేమ్ ఆన్. గీతానంద్, నేహా సోలంకి జంటగా నటించిన ఈ చిత్రానికి దయానంద్ దర్శకత్వం వహించారు. సీనియర్ నటులు మధుబాల, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు దయానంద్ చెప్పిన విశేషాలు.
“స్కూల్ డేస్ నుంచి సినిమాలపై ఇంట్రెస్ట్ ఉండేది. హ్యాపీ డేస్ సినిమా చూశాక అది మరింత ఎక్కువైంది. ఏం మాయ చేసావే సినిమా చూశాక మేకింగ్ నాచురల్ గా చేయొచ్చు అనిపించింది. పూరి జగన్నాథ్ గారి స్ఫూర్తితో డైరెక్టర్ రావాలనుకున్నా . అక్కడ నుంచి షార్ట్ ఫిలిమ్స్ కొన్ని చిత్రీకరించాను. తర్వాత అన్నపూర్ణ ఫిలిం స్కూల్లో ఆరు నెలలుకోర్స్ చేశాను. అక్కడే ప్రొడక్షన్, సౌండింగ్ గురించి నేర్చుకున్నాను. కొంతమంది రైటర్స్ తో ట్రావెల్ చేశాక మంచి కథ రాయాలనిపించింది అన్నారు డైరెక్టర్ దయానంద్