శంకర్ , చెర్రీల గేమ్‌ ఛేంజర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ కు పొలిటికల్ గేమ్‌ ఛేంజర్‌ వస్తాడా రాడా అన్న సందేహం వీడిన దగ్గర్నుంచి ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ పై అంచనాలు భారీగా పెరిగాయి. అనుకున్నట్టే రాజమండ్రిలో ‘గేమ్‌ ఛేంజర్‌’ ప్రీ రిలీజ్‌ జనవరి 4 న జరిగింది. పవన్‌ రాకతో అభిమానులు భారీ గా హాజరయ్యారు. ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈ ఈవెంట్‌ కి సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌ తో పాటు ఎమ్మెల్యేలు హాజరై పొలిటికల్ సర్కిల్‌లోనూ హాట్ టాపిక్ అయ్యింది.
డైరెక్టర్ శంకర్‌ చిత్రం గురించి మాట్లాడి ఉత్సాహపరచడంతో పాటు.. తన కూతురు పెళ్లి కార్డ్‌ ఇవ్వడానికి పవన్‌ కళ్యాణ్ ఇంటికి వెళ్తే ఆయన మర్యాద చూసి ఫిదా అయ్యానని ఉత్సాహంగా చెప్పారు. రియల్ గేమ్‌ ఛేంజర్ పవన్‌ కళ్యాణేనని, ఈ సినిమా గురించి మాట్లాడటం కంటే డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ మాటలు వినాలనుందని చెప్పాడు రామ్‌ చరణ్‌.


ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ రామ్‌ చరణ్‌ మా ఇంటి బంగారం.. హీరోల అభిమానులకే కాదు, హీరోలందరికీ నచ్చే హీరో రామ్‌ చరణ్‌ అన్నారు. శంకర్‌ ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన డైరెక్టర్‌ అని కొనియాడారు. కొత్త కథలతో సత్తా చాటాలని, హాలీవుడ్ నుంచి డిసిప్లిన్‌, ఫిల్మ్‌ మేకింగ్ టెక్నిక్స్‌ అడాప్ట్ చేసుకోవాలి , కానీ, మనం వుడ్ అనే పదాన్ని తెచ్చుకుని టాలీవుడ్‌ అని చెప్పుకుంటున్నాం.. ఆ సంస్కృతి పోవాలన్నారు. కొత్త సంవత్సరంలో గేమ్‌ ఛేంజర్‌ తో బాక్సాఫీస్ బద్దలైపోవాలని మూవీ లవర్స్‌ కు పిలుపిచ్చారు పవన్‌ కళ్యాణ్‌ గారు. ఎస్‌జే సూర్య, దిల్‌ రాజు, అంజలి మిగతా నటీనటులు, టెక్నిషియన్స్ గురించి చెప్పి చిత్ర విజయాన్ని కాంక్షించారు పవన్‌ కళ్యాణ్.

Leave a comment

error: Content is protected !!