చెర్రీ అభిమానులు, మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫిల్మ్ ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ వచ్చేసింది. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ పై అంచనాలు అంబరాన్ని దాటాయి. చెర్రీ తో కియారా అధ్వానీ జోడీ కడుతున్న ఈ మూవీలో చరణ్ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. మెసేజ్ ఓరియెంటెడ్ మూవీని భారీ కమర్షియల్ హంగులతో తీసే శంకర్ గ్రాఫిక్స్‌కి తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ మరోసారి తన పాత రూట్‌లో తీస్తున్న మూవీ ‘గేమ్ ఛేంజర్’.
ఈ సినిమా సెన్సార్ రీసెంట్ గా కంప్లీట్ చేసుకుని సంక్రాంతి కానుకగా జనవరి 10 కి రిలీజ్ ఫిక్స్ చేసుకున్న ఈ మూవీ ట్రైలర్ అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఉందనడంలో సందేహం లేదు. ఐఎఎస్ రోల్ చెర్రీ స్టైలిష్ యాక్షన్‌కి ఫిదా అవుతున్నారు ఆడియెన్స్. బుర్రా సాయిమాధవ్ రాసిన డైలాగ్స్, తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, శంకర్ టేకింగ్ , చెర్రీ యాక్షన్, డాన్స్ ఈ సినిమాకి హైలెట్ అనేలా ఉంది ట్రైలర్.గ్రాండ్ గా లాంచ్ అయిన ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి హాజరయ్యారు.