గ్లోబల్‌ స్టార్ రామ్‌చరణ్‌ , సెన్సేషనల్ డైరెక్టర్‌ శంకర్‌ డైరెక్షన్‌లో చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’. చెర్రీతో కియారా అద్వానీ సెకండ్‌ టైమ్‌ జోడీ కడుతున్న ఈ మూవీపై అంచనాలు భీభత్సంగా ఉన్నాయి. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతి కానుకగా రిలీజ్‌ కాబోతుంది. ఈ క్రేజీప్రాజెక్ట్‌కు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ తో మెగా ఫ్యాన్స్‌ తెగ ఖుషీ అవుతున్నారు.
మోస్ట్‌ ఎవెయిటెడ్‌ మూవీ ‘ గేమ్‌ ఛేంజర్‌ ‘ పై మెగా ఫ్యాన్సే కాదు..న్యూట్రల్‌ సినీ లవర్స్ అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్‌ కాబోతుంది. ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను కంప్లీట్ చేసుకుంది. యు/ ఏ సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్‌ టీమ్‌.
గేమ్ చేంజ‌ర్‌ను ఎస్‌వీసీ, ఆదిత్య‌రామ్ మూవీస్ సంస్థ‌లు త‌మిళంలో ప్రొడ్యూస్‌ చేస్తుండగా హిందీలో ఏఏ ఫిలిమ్స్ అనిల్ తడాని రిలీజ్‌ చేస్తున్నారు. ఈ చిత్రానికి సరిగమ ఆడియో పార్టనర్స్‌గా వ్యవహరిస్తున్నారు. గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్.. గేమ్ చేంజర్ చిత్రంలో రెండు ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌ల్లో మెప్పించ‌నున్నారు.

Leave a comment

error: Content is protected !!