థియేటర్స్ పూర్తి స్థాయిలో ఓపెన్ అయిన తర్వాత వరస విజయాలు వస్తున్నాయి మనకు. ఇప్పటికే 2021లో క్రాక్, ఉప్పెన, జాతిరత్నాలు లాంటి బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. దాంతో ఓటిటిలో సినిమా డైరెక్ట్ రిలీజ్‌లకు కాస్త బ్రేక్ పడింది అనే చెప్ప్పవచ్చు. ఆయా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ తో పాటు వసూళ్లను కూడా బాగా రాబట్టిన తర్వాత ఓటిటి లో విడుదలైన క్రాక్ మూవీ కి రికార్డ్ స్తాయి వ్యూస్ లభించాయి. గత ఆదివారం మా టివి లో టెలికాస్ట్ చేసిన ఈ సినిమాకు మంచి టి ఆర్ పి కూడా వచ్చింది.

సాధారణంగా సినిమాలు థియేటర్ లో విడుదలైన మూడు నాలుగు వారాల గ్యాప్ తర్వాత ఓటిటి ప్లాట్ ఫాంలో రిలీజ్ అవుతుంటాయి. కానీ ఈ నెల 11న విడుదలైన ‘గాలి సంపత్’ మాత్రం విడుదలైన ఎనిమిదో రోజుకే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. కనీసం నెల రోజుల గ్యాప్ కూడా లేకపోతే ఇక థియేటర్స్కు ప్రేక్షకులు ఎలా వస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్న సమయంలో 8 రోజుల్లోనే ఓటిటికి తమ సినిమాను ఇచ్చేసారు గాలి సంపత్ నిర్మాతలు. అనిల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, శ్రీవిష్ణు హీరోలుగా నటించారు చిత్రం తొలిరోజే ఈ సినిమాకు నెగిటివ్ టాక్ తెచ్చుకుని డిజాస్టర్‌ టాక్ తెచ్చుకుంది. సినిమా  ఫుల్ రన్‌లో కనీసం 2 కోట్లు కూడా తీసుకురాలేదని కలెక్షన్స్ పరంగా తెలుస్తుంది. ‘ఫిఫిఫి’ భాషలో రాజేంద్రప్రసాద్ బాగానే చేసినా కథ, కథనం లేకపోవడంతో గాలి సంపత్ కు ప్రేక్షక ఆదరణ తగ్గింది. దాంతో థియేటర్స్‌లో ఎలాగూ రన్ అవ్వడం లేదని ఓటిటికి ఇచ్చేసారు నిర్మాతలు.

కమర్షియల్ గా మంచి విజయం పొందిన ‘జాంబి రెడ్డి’ కూడా మార్చ్ 26న రిలీజ్ కానుంది. థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయిన ఆడియన్స్ గణనీయంగా ఉండటంతో ఈ సినిమా ఓటిటి వ్యూస్ కూడా మంచి రికార్డ్ స్థాయిలో వస్తాయన్న అంచనాలున్నాయి. ‘ఉప్పెన’ ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన బిగ్గెస్ట్ హిట్ చిత్రం. ఇక ఈ సినిమాను నెట్ ఫ్లిక్ష్ సంస్థ ద్వారా ఓటిటి రిలీజ్ కి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ రెండు సినిమాల ఓటిటి రిలీజ్ పోటిలలో ఇక గాలి సంపత్ ను ఎలా ఆదరిస్తారో చూడాలి.

Leave a comment

error: Content is protected !!