‘కాస్త నన్ను నువ్వు నిన్నునేను తాకుతుంటే.. తాకుతున్నచోట సోకు నిప్పు రేగుతుంటే.. రేగుతున్నచోట భోగిమంట అంటుకుంటే.. మంట చుట్టు ముట్టి కందికుప్పలంటుకుంటే.. ’ అద్భుమైన , అందమైన భావంతో చంద్రబోస్ రాసిన ఈ పాట .. బహుశా స్టూడెంట్ నెంబర్ 1 చిత్రంలోని కథానాయిక గజాలా అందాన్ని చూసే రాసి ఉంటాడు అనిపిస్తుంది. అంతటి అపురూపమైన, అద్భుతమైన సౌందర్యం ఆమెది. అందమైన ముఖం, అమాయకమైన కళ్లు… కొంటెగా నవ్వే పెదవులు.. చిలిపిగా చూసే చూపు.. అప్పటి కుర్రకారు మరిచిపోలేరు.
2001లో జగపతి బాబు హీరోగా నటించిన ‘నాలో ఉన్న ప్రేమ’ అనే మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన గజాలా.. ఆ వెంటనే రాజమౌళి స్టూడెంట్ నెంబర్ 1 మూవీలో యన్టీఆర్ సరసన కథానాయికగా ఫిక్సైపోయింది. ఆ సినిమా సూపర్ హిట్టవడంతో అమ్మడికి అవకాశాలు ఓ రేంజ్ లో వచ్చిపడ్డాయి. ‘కలుసుకోవాలని, తొట్టి గ్యాంగ్, అల్లరిరాముడు’ లాంటి చిత్రాల్లో గ్లామరస్ గా మెరిసిన గజాలా .. చివరగా నటించిన తెలుగు చిత్రం జెడీ చక్రవర్తి దర్శకత్వం వహించిన ‘మనీ మనీ మోర్ మనీ’ . తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో సైతం పలు చిత్రాల్లో తన అందమైన అభినయాన్ని ప్రదర్శించిన గజాలా ..ఆ తర్వాత మస్కట్ లో ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేసింది. 2016 లో టీవీ నటుడు ఫైజల్ రజాఖాన్ ను పెళ్లి చేసుకుంది. నేడు గజాలా పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆ అందాల భామకి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.
హ్యాపీ బర్త్ డే గజాలా