పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే. ఎనిమిదేళ్ళ క్రితం విడుదలైన ఆ సినిమాను అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు. పవర్ స్టార్ ట్రేడ్ మార్క్ యాక్టింగ్ విత్ యాక్షన్, హరీశ్ శంకర్ మాస్ మేకింగ్ ఈ సినిమాను బ్లాక్ బస్టర్ గా నిలిపాయి. అయితే ఈ సినిమా ఘన విజయంలో కీలకపాత్ర పోషించిన మరో అంశం మ్యూజిక్. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన ఎనర్జిటిక్ అండ్ మైండ్ బ్లోయింగ్ మ్యూజిక్ గబ్బర్ సింగ్ రేంజ్ ను పెంచేసింది. అందుకే హరీశ్ శంకర్ ఆ మ్యాజిక్ ను రిపీట్ చేస్తానంటున్నాడు. మాస్ బీట్స్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను మరోసారి ఊపేస్తానంటున్నాడు. డైరెక్టర్ హరీష్ శంకర్ తో  పవన్ కళ్యాణ్ తన 28వ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడని హరీష్ శంకర్ తెలిపాడు.

అందుకే దర్శకుడు హరీష్ శంకర్.. పవన్ తో  చేయబోయే తన తరవాత సినిమా గురించి ట్విట్టర్ వేదికగా కొత్త సమాచారం ఇచ్చాడు. ‘‘ఇది ఒక అద్భుతమైన రోజు. 8 సంవత్సాల క్రితం విడుదల తేదీ ఇప్పటికి పవర్ఫుల్ రోజుగా గుర్తుంది. ఈసారి కూడా దేవి నేను కలిసి గబ్బర్ సింగ్ మ్యూజికల్ ఎనర్జీని మరోసారి క్రియేట్ చేయడానికి వస్తున్నామని తెలిపాడు. ఇక ఈ విషయం ప్రకటించడానికి ఇంత కన్నా గొప్ప రోజు ఏముంటుంది. పవన్ కళ్యాణ్ 28వ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చనున్నారు. మేం మళ్లీ వస్తున్నాం.. ఇప్పుడే మొదలైంది’’ అని హరీష్ శంకర్ తన ట్వీట్ ద్వారా తెలిపాడు. ఇక రెండోసారి పవన్ హరీష్ దేవీల కాంబో రిపీట్ కానుందని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

 

 

Leave a comment

error: Content is protected !!