Fouzi movie : తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఎంతగానో ఆసక్తిని కలిగిస్తున్న చిత్రం ఫౌజీ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి కలయికలో తెరకెక్కుతున్న ఈ చిత్రం, తన ప్రీ-ప్రొడక్షన్ దశ నుంచే అంచనాలను అంచెలంచెలుగా పెంచుతూ వస్తోంది.
హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ఈ చిత్రం ప్రస్తుతం తమిళనాడులోని మధురైలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రస్తుతం ప్రభాస్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇతర కీలక నటీనటులపై దృష్టి సారించి హను రాఘవపూడి సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ ఎప్పుడు షూటింగ్‌కు తిరిగి చేరతారు అన్నది ఇంకా తెలియదు.

ఈ చిత్రంలో ప్రభాస్ రెండు భిన్నమైన పాత్రలను పోషిస్తున్నారు. ప్రభాస్‌కు జోడిగా ఇమ్మాన్వీని ఎంపిక చేయడం విశేషం. ఇమ్మాన్వీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న డాన్స్ వీడియోలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రభాస్‌కు సమానంగా డాన్స్ చేయడం ఇమ్మాన్వీకి గట్టి పోటీగా మారుతుందని భావిస్తున్నారు.

ఈ చిత్రంలో మరో హీరోయిన్ కోసం అన్వేషణ జరుగుతోంది. ఈ పాత్ర కోసం పేరున్న భామను దించాలని హను రాఘవపూడి ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్‌కు తగిన జోడిగా ఉంటూ, పాన్ ఇండియా ఇమేజ్‌కు తగిన నటిని ఎంపిక చేయాలని భావిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!