ఇప్పటివరకు ఎన్నో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ కథలొచ్చాయి. కానీ ఫుల్ లెంగ్త్ ఫుట్‌బాల్ బ్యాక్ డ్రాప్‌లో రాబోతున్న మూవీ ‘డ్యూడ్‘. ఇందులో సూపర్బ్ లవ్‌స్టోరీ కూడా ఉండబోతుంది. గతంలో రామాచారి అనే కన్నడ మూవీలో నటించిన యంగ్ హీరో తేజ్ ఈ చిత్రంలో నటిస్తూ పనరోమిక్ స్టూడియోస్ బ్యానర్‌పై స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. కంప్లీట్ ఫుట్ బాల్ బ్యాక్‌డ్రాప్‌తో రాబోతుండటంతో ఈ చిత్రానికి కర్నాటకలోని ఫుట్‌బాల్ క్లబ్ ‘కిక్‌స్టార్‘ సంపూర్ణ సహకారం అందిస్తోంది. తెలుగు కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్‌లో సెట్స్‌కు వెళ్లనుంది. అలా మొదలైంది కి కెమెరా వర్క్ చేసిన ప్రేమ్ ఈ సినిమాకి డీఓపీ.. ఇమిల్ మొహమ్మద్ సంగీతం అందిస్తున్నారు.