రెబల్ స్టార్ కృష్ణంరాజు ఎయిటీస్ లో భలే జోరుమీదుండేవారు. ఆయన నటించిన యాక్షన్ చిత్రాలన్నీ అప్పట్లో మాస్ జనాన్ని ఉర్రూత లూగించేవి. అందులో ఓ సూపర్ యాక్షన్ చిత్రం ‘పులిబిడ్డ’ . వి.మధుసూదనరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను హేరంభ చిత్ర మందిర్ పతాకంపై నాచు శేషగిరిరావు నిర్మించారు. అందాల శ్రీదేవి కథానాయికగా కైకాల సత్యనారాయణ , షావుకారు జానకి, అంజలీదేవి , ప్రభాకరరెడ్డి ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమా .. టాలీవుడ్ లో బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన తొలి చిత్రంగా ప్రత్యేకతను సంతరించుకుంది. ఓ బాక్సింగ్ ఛాంపియన్ తన మిత్రుల కుట్రకు బలవుతాడు. అయితే అతడి కొడుకు బాక్సింగ్ ఛాంపియన్ అయి. పగతీర్చుకోవడమే చిత్ర కథ. చక్రవర్తి సంగీతం సమకూర్చిన ఈ సినిమాలోని పాటలు విశేష ప్రాచుర్యం పొందాయి. ముఖ్యంగా కాశీ విశ్వనాథ పాట ..అప్పట్లో మారుమోగిపోయింది. కృష్ణంరాజు కెరీర్ లో ఎప్పటికీ ఎవర్ గ్రీన్ చిత్రం ‘పులిబిడ్డ’.

Leave a comment

error: Content is protected !!