టాలీవుడ్ సినీ సామ్రాజ్యాన్ని ఒకప్పుడు మకుటం లేని మహారాజులా ఏలిన దర్శకుడు దాసరినారాయణరావు. ఆయన దర్శకత్వంలో నటించడానికి అప్పట్లో అగ్రహీరోలంతా పోటీ పడేవారు. కథ ఏంటని అడగకుండానే.. ఆయన సినిమాలకు కాల్షీట్స్ కేటాయించేవారు హీరోలు. ఆ రేంజ్ లో స్టార్ డమ్ తెచ్చుకున్న మరో దర్శకుడు అప్పట్లో లేడంటే అతిశయోక్తి లేదు. అయితే.. అలాంటి దర్శకుడికి కూడా ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది కదా. అప్పట్లో దాసరి డ్రీమ్ ప్రాజెక్ట్ చింతామణి. కాళ్ళకూరి నారాయణరావు రాసిన చింతామణి నాటకం అప్పట్లో చాలా పాపులర్. 1956 లో యన్టీఆర్, యస్వీఆర్ , భానుమతి నటించిన చింతామణి చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. బిల్వమంగళుడుగా యన్టీఆర్, భవానీ శంకరుడుగా యస్వీఆర్, చింతామణిగా భానుమతి, సుబ్బిశెట్టి గా రేలంగి నటించిన ఆ సినిమాను .. ఎయిటీస్ లో దాసరి నారాయణరావు రీమేక్ చేయాలని అనుకున్నారు. బిల్వమంగళుడుగా మోహన్ బాబు, భవానీ శంకరుడుగా శోభన్ బాబు, చింతామణి గా శ్రీదేవి తదితర నటీనటుల్ని ఎంపికచేశారు. ఇక ఇందులో అతి ముఖ్యమైన హాస్యపాత్ర అయిన సుబ్బిశెట్టి పాత్రను తాను పోషించాలనుకున్నారు దాసరి. ఆ ప్రాజెక్ట్ కోసం 1983లో ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ అనౌన్స్ చేశారు దాసరి. కానీ ఏవో కొన్ని కారణాల వల్ల అప్పట్లో అది కార్యరూపం దాల్చలేకపోయింది. మరి అప్పట్లో గానీ.. ఆ ప్రాజెక్ట్ గానీ వచ్చి ఉండి ఉంటే.. శ్రీదేవి కెరీర్ లో చింతామణి పాత్ర మరింత ఆభరణమై మెరిసేదేమో కదా

Leave a comment

error: Content is protected !!