మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అసంఖ్యాకమైన ఆయన అభిమాన గణమే ఆయన బలం. 1978 నుంచి 1988 వరకూ మొత్తం 100 చిత్రాల్ని పూర్తి చేసుకున్న చిరంజీవి .. 2015 లో ఖైదీనంబర్ 150 తో 150చిత్రాల్ని పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటికీ ఇప్పటికీ చెక్కుచెదరని ఆయన క్రేజ్ .. ఎర్లియర్ నైంటీస్ లో అయితే పీక్స్ లో ఉండేది. నిర్మాత దర్శకుడు అయిన విజయబాపినీడు చిరంజీవి పేరు మీద ఏకంగా ఒక ఖరీదైన మ్యాగజైన్ నడిపావారంటే… చిరు ఫాలోయింగ్ అప్పట్లో ఎలా ఉండేదో అర్ధం చేసుకోవచ్చు. ఇంతకీ అప్పట్లో ఆ మ్యాగజైన్ ఖరీదు ఎంతో తెలుసా? అక్షరాలా 10రూపాయలు. పది రూపాయలు నైంటీస్ లో చాలా ఎక్కువ. సరిగ్గా గ్యాంగ్ లీడర్ , రాజా విక్రమార్క సినిమాలు విడుదలయిన కాలం అది. మ్యాగజైన్ కోసం చాలా కాస్ట్లీ పేపర్ వాడేవారు. అప్పట్లో సోవియట్ రష్యా వారిది ఒక మ్యాగజైన్ వచ్చేది. దాని పేపర్ చాలా ఖరీదైంది. ఆ క్వాలిటీనే చిరంజీవి మ్యాగజైన్ కు వాడేవారు విజయబాపినీడు. అలాగే.. ప్రతీ వారం చిరు హీరోగా.. పాపులర్ రైటర్స్ అందులో సీరియల్స్ రాసేవారు. ఇక ఆ మ్యాగజైన్ లోని సెంటర్ పేజెస్ లో పాఠకులకు , అభిమానులకు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చేవారు విజయబాపినీడు. పెద్ద పోస్టర్ లాంటి స్టిల్ ను సెంటర్ పేజ్ లో ప్రింట్ చేయించేవారు. దాంతో ఆ మ్యాగజైన్ అంత ఖరీదైనదైనా ఎగబడి మరీ కొనేసేవారు అభిమానులు. దటీజ్ మెగాస్టార్ …

Leave a comment

error: Content is protected !!