Bachala Malli : అల్లరి నరేష్ హీరోగా, అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తున్న యాక్షన్ డ్రామా చిత్రం “బచ్చల మల్లి”. 1990 నేపథ్యంలో సాగే ఈ సినిమాను సుబ్బు మంగదేవి దర్శకత్వం వహిస్తున్నాడు. “సోలో బ్రతుకే సో బెటర్” ఫేమ్ సుబ్బు మంగదేవి ఈ చిత్రంతో పీరియాడికల్ డ్రామాలోకి అడుగుపెడుతున్నాడు. రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

“మా ఊరి జాతరలో” అనే మొదటి పాట లేటెస్ట్ గా విడుదలైంది. దీనికి మంచి స్పందనను లభించింది. శ్రీమణి సాహిత్యం సమకూర్చిన ఈ పాటకు విశాల్‌ చంద్రశేఖర్‌ స్వరాలు కూర్చారు. అ సినిమాలో నరేష్ పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని, ఇంతకు ముందు ఎప్పుడూ చూడని లుక్‌లో కనిపించబోతున్నారని చిత్రబృందం తెలిపింది.

Leave a comment

error: Content is protected !!