Sundarakanda : నారా రోహిత్ హీరోగా నటిస్తున్న 20వ చిత్రం ‘సుందరకాండ’ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. నూతన దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సందీప్ పిక్చర్స్ ప్యాలెస్ బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి మరియు రాకేష్ మహంకాళి నిర్మించారు.

ఇటీవల విడుదలైన టీజర్‌లో మధ్య వయస్కుడైన ఒంటరి వ్యక్తిగా నారా రోహిత్‌ను పరిచయం చేశారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమానుంచి మొదటి సింగిల్ బహుశా బహుశా ను విడుదల చేశారు. దీంతో ఈ చిత్రంలో వినోదానికి కొదవేమీ లేదని స్పష్టం అయింది. లియోన్ జేమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

ఈ పాట నారా రోహిత్ అండ్ శ్రీదేవి విజయ్ కుమార్ జంటపై చిత్రీకరించబడింది. మొదటి ప్రేమ, చిన్ననాటి క్రష్‌ను అందంగా ఆవిష్కరించే ఈ పాట టీనేజ్ వయస్సులోని సరిగమాలను తెరపై చూపిస్తుంది. ఫ్లూట్ మరియు మౌత్ ఆర్గాన్ వంటి అరుదైన వాయిద్యాలతో కూడిన ఈ పాట ప్రేక్షకులను అలరిస్తోంది.

ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ ఈ పాటకు జీవం పోశారు. అతని శ్రావ్యమైన గొంతు ఈ పాటకు మరింత ఆకర్షణను చేకూర్చింది. శ్రీ హర్ష ఈమాని సాహిత్యం ఈ పాటకు మరింత అందాన్ని చేకూర్చింది. నారా రోహిత్, వృత్తి వాఘని, శ్రీ దేవి విజయ్ కుమార్, నరేష్ విజయ కృష్ణ, వాసుకి ఆనంద్, కమెడియన్ సత్య, అజయ్, వీటీవీ గణేశ్, అభినవ్ గోమతం, విశ్వంత్, రూపా లక్ష్మి, సునైనా, రఘు బాబు తదితరులు ఈ చిత్రంలో నటించారు.

Leave a comment

error: Content is protected !!