Rajasaab : పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో ‘ రాజా సాబ్’ అనే పక్కా హారర్ ఫాంటసీ ఎంటర్టైనర్ ఒకటి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన గ్లింప్స్ కి అద్భుతమైన స్పందన లభించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఈ సినిమాకి థమన్ అందిస్తున్న సంగీతం అందరినీ అలరించేలా ఉంటుందని అంచనా. తాజాగా ఈ సినిమా నుంచి రాబోయే ఫస్ట్ సింగిల్ విడుదల తేదీని థమన్ స్వయంగా ప్రకటించాడు. ఈ సినిమాలోని మొదటి పాటను వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయాలని నిర్ణయించామని ఎక్స్ వేదికగా తెలిపాడు. అంటే, ఈ అద్భుతమైన పాటను వినాలంటే మనం మరో ఐదు నెలలు ఆగాల్సిందే. ‘ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారు. ఈ భారీ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!