తెలుగు ఇండస్ట్రీ లో పేరు ప్రఖ్యాతలు పొందిన అతి పెద్ద బ్యానర్ లో “శ్రీరామ్ ఏడిద” గారి పూర్ణోదయ బ్యానర్ ఒకటి. కొన్ని దశాబ్దాలు తరువాత శ్రీరామ్ ఏడిద గారి మనవరాలు శ్రీజ నిర్మాతగా, శ్రీజ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శ్రీకాంత్ రెడ్డి, సంచిత బసు హీరో హీరోయిన్స్ గా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం చేస్తూ “ఫస్ట్ డే ఫస్ట్ షో” సినిమా ని తెరకెక్కించారు. మిత్రవింద మూవీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఈ చిత్రానికి జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్ కేవీ స్టోరీ, స్క్రీన్ ప్లే అందించగా, వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి దర్శకత్వం వహించారు. ఈ సినిమా అతి త్వరలో థియేటర్ లో సందడి చేయనుండగా ఈ సందర్భంగా “ఫస్ట్ డే ఫస్ట్ షో” డైరెక్టర్స్ మీడియా తో ముచ్చటించారు.
వంశీధర్ మాట్లాడుతూ: నేను అస్సిటెంట్ డైరెక్టర్ గా జాతి రత్నాలు కి పని చేసిన తరువాత నేను, కేవీ అనుదీప్ ఒక ఇంటరెస్టింగ్ కథ అనుకోవడం కలిసి కథ ని ఫినిష్ చేసాం.నాకు పెద్దగా డైరెక్షన్ ఎక్సపీరియెన్స్ లేకపోవడం వల్ల, జాతి రత్నాలు సినిమా కి రైటర్ గా పని చేసిన లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి తో కలిసి ఇద్దరం డైరెక్ట్ చేద్దామనుకున్నాం. ఇద్దరం కలిసి వర్క్ చేసేటప్పుడు ఎక్కడ క్ల్యాష్ రాకుండా సినిమా ని సక్సెస్ఫుల్ గా 35 డేస్ లో కంప్లీట్ చేసాం.
సినిమా స్టోరీ లైన్ ఏంటి అంటే?
ఈ సినిమా కథ ఒక 2 డేస్ లో జరుగుతుంది. హీరో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ తనతో ఎప్పుడు మాట్లాడని హీరోయిన్ ఒకరోజు వచ్చి, ఖుషి సినిమా కి టికెట్స్ కావాలని అడుగుతుంది. ఖుషి సినిమా రీలిజ్ రోజు, హీరో ప్రేమించిన అమ్మాయి కోసం టికెట్స్ ఇవ్వడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసి హీరోయిన్ కి సినిమా చుపించాడనేది కథ. సినిమా చాలా ఫన్నీ గా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలి అంటే, జాతి రత్నాలు ఫ్ల్యావర్ లో ఉంటుంది.
ఖుషి సినిమా రీలిజ్ అయ్యినప్పుడు నేను చాలా చిన్న పోరగాడిని, అప్పట్లో సినిమా రీలిజ్ అయ్యినప్పుడు “ఫస్ట్ డే ఫస్ట్ షో” చూడాలని పబ్లిక్ చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ ప్రయత్నాల్లో వాళ్ళు ఎలాంటి పని కైనా చేయడానికి రెడీ గా ఉండే వారు. ఆఖరికి చంపడానికి కూడా వెనకాడరు. సో, ఇలాంటివి నేను చాలా విన్నాను చూసాను కూడా. ఆ విధంగా సినిమా లో కొన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది.
మ్యూజిక్ డైరెక్టర్ మేము చెప్పింది అర్ధం చేసుకొని, అవుట్ ఫుట్ ఇవ్వడం అనేది సూపర్బ్ అసలు. పూర్ణోదయ బ్యానర్ ద్వారా ఎన్నో సినిమాలు నేషనల్ వైడ్ గా హిట్ అవ్వడం. అలాంటి బ్యానర్ లో మేము చేయడం చాలా హ్యాపీ గా ఉంది. మేము ఫస్ట్ షెడ్యూల్ తొందరగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫినిష్ చేయడం తో, ప్రొడ్యూసర్స్ కి మా మీద నమ్మకం ఇంకా పెరిగింది.
హీరో శ్రీకాంత్ రెడ్డి పిట్టగోడ మూవీ లో యాక్ట్ చేసాడు. అతని యాక్టింగ్ చూసి, మన సినిమా కి సెట్ అవ్వడంతో ఆడిషన్ చేసి తీసుకున్నాం. హీరోయిన్ “సంచిత బసు” బీహార్ నుంచి వచ్చింది. ఈ సినిమా ద్వారా అందరికి పరిచయం అవ్వుతుంది.
లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి మాట్లాడుతూ: నేను 10 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీ లో ఉన్నాను. జాతి రత్నాలు సినిమా కి రైటర్ గా పనిచేసాను. ఒకరోజు శ్రీజ ఏడిద గారు ఫోన్ చేసి, ఇలా ఒక స్టోరీ అనుకున్నాం. దానికి మీరు డైరెక్షన్ చేస్తారా అని అడిగారు, ఆల్రెడీ జాతి రత్నాలకి కలిసి నేను, వంశీధర్ పని చేసాం కాబట్టి, నేను కూడ దానికి ఒప్పుకొని ఇద్దరం కలిసి ఈ సినిమా ని పూర్తి చేయడం చాలా హ్యాపీ గా ఉంది.
హీరో శ్రీకాంత్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి, ఎంత వరుకు కథ కి అవసరమో అంత వరుకు పవన్ కళ్యాణ్ గారి మానియా సీన్స్ పెట్టడం జరిగింది. ఈ సినిమాలో తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, మహేష్ ఆచంట, ప్రభాస్ శ్రీను, గంగవ్వ, సీవీఎల్ నరసింహారావు, వంశీధర్ గౌడ్ ఇలా చాలా మంది సీనియర్ లు యాక్ట్ చేసారు. వాళ్ళతో వర్క్ చేయడం చాలా హ్యాపీ గా ఉంది . ఈ సినిమాకి వాళ్ళ క్యారెక్టర్స్ అద్భుతంగా వర్కౌట్ అవ్వుతాయి. మేము కూడా చాలా ఫాస్ట్ గా సినిమా ని ఫినిష్ చేసాం. వాళ్ళు కూడ మమ్మలిని మా టీం ని మెచ్చుకున్నాను.
నాకు కామిడి జెనెర్స్ అంటే ఇష్టం. ఫీచర్ లో కూడా కామెడీ జెనర్స్ చేయడానికి ఇష్టపడతాను. ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాలో ప్రతి సీన్స్ చాలా కొత్తగా ఎక్సయిటింగ్ గా ఉంటుంది. ప్రేక్షలు బాగా థ్రిల్ అవ్వుతారు. ఈ సినిమా మొత్తం జోగిపేట్ ఏరియా లో చేసాము.