పోటీ అనేది ప్ర‌తీ ఫీల్డ్‌లో కామ‌న్‌. అయితే సినిమా ఫీల్డ్‌లో ఈ పోటీ ఇంట్ర‌స్టింగ్ గా ఉంటుంది. ఇప్పుడు క‌లెక్ష‌న్ల లెక్క‌లు రికార్డ్స్‌గా లెక్కిస్తున్నారు. కానీ ఒక‌ప్పుడు మాత్రం ఎన్ని సెంట‌ర్ల‌లో హండ్రెడ్ డేస్ ఆడింద‌నేది ప్రామాణికంగా ఉండేది. ఇక ఫ్యాన్స్ అయితే ఈ విష‌యాన్ని మ‌రీ సెన్సిటివ్ గా తీసుకునేవారు. ఈ సెంట‌ర్స్ రికార్డ్ పోటీ అప్ప‌ట్లో ఎన్టీఆర్ ఎఎన్నార్ మ‌ధ్య‌, త‌రువాత చిరు, బాల‌య్య‌ల మ‌ధ్య ఎక్కువ‌గా వుండేది. ఇండ‌స్ట్రీలో ఎవ‌రూ ఎవ‌రికి పోటీ కాదు. ఎవ‌రి సినిమాలు వారికుంటాయి, ఎవ‌రి బలాబ‌లాలు వారికుంటాయి. ఒక‌రితో పోల్చి మ‌రొక‌రిని త‌క్కువ చేయ‌డం క‌రెక్ట్ కాదు. 2001లో సంక్రాంతి బ‌రిలో న‌ర‌సింహ‌నాయుడు, మృగ‌రాజు, దేవీపుత్రుడు మూవీస్ వున్నాయి. ఇందులో మృగ‌రాజు, న‌ర‌సింహ నాయుడు సినిమాలు జ‌న‌వ‌రి 11 న రిలీజ‌య్యాయి. ఈ ఇద్ద‌రి ఫ్యాన్స్ హంగామాకు ఆకాశ‌మే హ‌ద్దు అని చెప్పాలి. క‌టౌట్స్ పాలాభిషేకాల‌తో జ‌రిగిన ర‌చ్చ మామూలుగా లేదు. కొన్ని సెంట‌ర్ల‌లో ప‌క్క ప‌క్క థియేట‌ర్ల‌లోనే మృగ‌రాజు, న‌ర‌సింహ నాయుడు సినిమాలు రిలీజ‌య్యాయి. స‌హ‌జంగానే మృగ‌రాజుకు హైప్ ఎక్కువ‌గా వుంది. ఆ సినిమాలో చిరు సింహం ల ఫైట్ హైలెట్ అవుతుంది, ఇలాంటి సీన్స్ ఇప్ప‌టిదాకా తెలుగు సినిమాల్లో రాలేద‌నే ప్ర‌చారం బాగా జ‌ర‌గ‌డం వ‌న్ ఆఫ్ ది రీజ‌న్‌. చిరు పాట పాడ‌టం మ‌రో రీజ‌న్‌. ఇంత భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ వున్న మృగ‌రాజు బాక్సాఫీస్ రేస్‌లో బోల్తా కొట్టింది. అదే రోజు రిలీజ‌యిన బాల‌య్య మూవీ న‌ర‌సింహానాయుడు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయి కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. కొద్ది గ్యాప్‌తో రిలీజ‌యిన దేవిపుత్రుడు కూడా ఫ్లాప్ అయ్యింది. అయితే ఇందులో గ్రాఫిక్స్ సీక్వెన్స్ మాత్రం హైలెట్‌గా నిలిచాయి. మొత్తం మీద 2001 సంక్రాంతి హీరోగా బాల‌య్య నిలిచాడు. అలాగే 2017 లో కూడా బాల‌య్య‌, చిరుల సంక్రాంతి ట‌ఫ్ వార్ జ‌రిగింది. అయితే ఒక్క రోజు గ్యాప్‌తో విడుద‌ల‌య్యాయి. చిరు రీఎంట్రీ మూవీగా జ‌న‌వ‌రి 11న రిలీజ‌యిన ఖైదీ నెం 150 కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. త‌రువాత రోజు రిలీజ‌యిన బాల‌య్య గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి మూవీ కూడా బాల‌య్య కెరీర్‌లో ఆల్‌టైమ్ హిట్‌గా నిలిచింది. సో 2017 లో మాత్రం సంక్రాంతి హీరోలుగా ఇద్ద‌రూ స‌క్సెస్ అయ్యారు.

Leave a comment

error: Content is protected !!