టైగర్‌ నాగేశ్వరరావు.. రవితేజ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుంది.. ఈ మాట అంటున్నది ఫైట్‌మాస్టర్స్‌ రామ్‌ లక్ష్మణ్. రవితేజ, దర్శకుడు వంశీ, అభిషేక్‌ అగర్వాల్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ టైగర్‌ నాగేశ్వరరావు. ఈ సినిమా అక్టోబర్‌ 20 న పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా పాత్రికేయులతో సినిమా విశేషాలు ముచ్చటించారు ఫైట్‌మాస్టర్స్ రామ్‌ లక్ష్మణ్‌లు.

మేం స్టూవర్ట్ పురం ప్రాంతంలోనే పుట్టాం. టైగర్‌ నాగేశ్వరరావు గురించి ఊర్లో కథలు కథలుగా చెప్పేవారు. రన్నింగ్ ట్రైన్ ఎక్కేవారనీ, చెట్ల మీద కూడా పరిగెత్తేవారనీ.. దొంగతనం చేస్తానని చెప్పి మరీ చేసేవారనీ ఇలా ఎన్నో ఆసక్తికర విషయాలు వినేవాళ్లం. అలా ఈ కథతో మాకు కనెక్షన్‌ ఉంది. సవాల్ చేసి దొంగతనం చేయడమంటే మాటలు కాదు.. తప్పించుకోవడం అంత ఈజీ కాదు.. అలాంటి పాత్రను చూస్తున్నపుడు హీరోయిజం కనిపిస్తుంది.. టైగర్‌ నాగేశ్వరరావు చెన్నై జైలు నుంచి తప్పించుకున్నారు. నాగేశ్వరరావు కు టైగర్‌ అనే బిరుదు ఇచ్చింది పోలీసుల.. ఒక దొంగకు పోలీసులు బిరుదు ఇవ్వడం అంటే ఆషామాషీ కాదు. సినిమాల్లో ఫైట్లు చేసేటపుడు రోప్‌ టెక్నిక్స్‌, వైద్య నిపుణుల బృందం, ఇంకా ఎన్నో ఏర్పాట్లు చేస్తాం.. కానీ ఇవేవీ లేకుండా అంత ఎత్తు చెట్లు, జైలు గోడలు ఎలా ఎక్కేవారో ఆలోచిస్తే ఆశ్చర్యమేస్తుందన్నారు రామ్‌ లక్ష్మణ్. ఒక దొంగ గురించి ప్రధాన మంత్రి ఆరా తీసేంత గుర్తింపు పొందడం, ఇంతలా పాపులర్ కావడం ఆశ్చర్యం. నేచర్ సపోర్ట్ లేకుండా ఇలాంటి ప్రత్యేకత సాధ్యం కాదన్నారు రామ్‌ లక్ష్మణ్‌లు.

ఈ చిత్రం కోసం ఫైట్లు చాలా రియలిస్టిక్‌ గా కంపోజ్ చేసాం. రవితేజ గారికి ఎన్నో చిత్రాల్లో ఫైట్స్ కంపోజ్ చేసాం. ఈ చిత్రం కోసం చీరాల ప్రాంతంలోని జీడితోటల్లో చేసిన ఫైట్స్‌ అద్భుతంగా వచ్చాయి.

టైగర్ నాగేశ్వరరావు’ జీవితంలో ఊహకు అందని కొన్ని విషయాలు వున్నాయి. అప్పట్లో ట్రైన్ , బస్సు .. స్టువర్ట్ పురం దాటే వరకూ ఒక భయం వుండేది. ఆయన రన్నింగ్ ట్రైన్ ఎక్కేవారు. ఇందులో యాక్షన్ ని డిజైన్ చేయడంలో రవితేజ గారు ఎంతో సహకరించారు. రవితేజ గారి బాడీ లాంగ్వేజ్ ‘టైగర్ నాగేశ్వరరావు’ పాత్రకు పర్ఫెక్ట్ గా యాప్ట్ అయ్యింది

దర్శకుడు వంశీ మాకు చిన్నప్పటినుంచి తెలుసు. చెన్నైలో చదువుకున్నాడు. ఈ సినిమా కోసం మూడేళ్ళ పాటు లోతుగా పరిశోధన చేశాడు. స్థానిక ప్రాంతాల్లో తిరిగి ఎన్నో ఆయన గురించి ఎన్నో విషయాలు సంగ్రహించాడు. అద్భుతమైన కథని తయారు చేసి చాలా గొప్పగా ప్రజెంట్ చేశారు.

నిర్మాత అభిషేక్ అగర్వాల్ గారు ఇందులో ఫైట్స్ చూసి చాలా ఆనందపడ్డారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించారు. కెమరామెన్ మధిగారు చాలా అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు.

Leave a comment

error: Content is protected !!