బాలకృష్ణ గారితో పైసా వసూల్, వీరసింహారెడ్డి చిత్రాలు చేశాను. ఆయన బాడీ లాంగ్వేజ్ మీద పట్టు దొరికింది. ఆయనకి ఎలాంటి యాక్షన్ సీక్వెన్స్ లు ఐతే బావుటుందో అవగాహన వచ్చింది. ఆయన వేగాన్ని అర్ధం చేసుకోగలిగాం. అవన్నీ భగవంత్ కేసరి కి ప్లస్ అయ్యాయి. భగవంత్ కేసరి యాక్షన్ లో ఎడిటింగ్ ప్యాట్రన్ కూడా కొత్తగా వుంటుంది. యాక్షన్ సీక్వెన్స్ లు క్రిస్ప్ గా ఉంటాయ్ అదే సమయంలో ఇంపాక్ట్ ఫుల్ గా వుంటాయి అంటున్నారు భగవంత్‌ కేసరి ఫైట్‌మాస్టర్‌ వెంకట్‌. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్‌ 19 న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా ఫైట్‌ మాస్టర్‌ వెంకట్‌ విలేకరుల సమావేశంలో ముచ్చటించారు. వారి మాటల్లోనే

దర్శకుడు అనిల్ రావిపూడి గారు ఈ కథని రాయడం మొదలుపెట్టినప్పుడే బాలకృష్ణ గారిని కొత్తగా చూపించాలని అనుకున్నారు. నాకు చెప్పినప్పుడు కూడా ముందు సినిమాలకి దీనికి తేడా వుండాలని చెప్పారు. బాలకృష్ణ గారిని కొత్తగా చూపించాలని ఆయన మనసులో బలంగా వుంది. భగవంత్ కేసరి ఫస్ట్ హాఫ్ లో ఒక స్టైల్ యాక్షన్, సెకండ్ హాఫ్ లో మరో స్టైల్ యాక్షన్ వుంటుంది. బాలకృష్ణ గారి స్పీడ్ ని పట్టుకొని హాలీవుడ్ స్టైల్ లో చాలా నేచురల్ గా యాక్షన్ ని డిజైన్ చేయడం జరిగింది. అనిల్ రావిపూడి గారు ఈ నేచురల్ స్టైల్ ని బలంగా నమ్మారు. మేము కూడా దాన్ని అడాప్ట్ చేసుకొని బాలకృష్ణ గారితో ఈసారి కొత్త స్టైల్ ఆఫ్ యాక్షన్ ప్రయత్నించాం. ఇది ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం వుంది. యాక్షన్ సన్నివేశాల్లో బాలయ్య బాబు గారి కష్టం కనిపిస్తుంది. ఇందులో ఎక్కువ కట్స్ ని ప్లాన్ చేసుకోలేదు. స్లో మోషన్ షాట్స్ ని తగ్గించేశాం. 24 ఫ్రేమ్స్ లో ఆయన యాక్షన్ చేస్తే ఎలా వుంటుందో దాన్నే చేశాం.

బాలయ్య ఓ ఫ్యాక్టరీలో పని చేస్తారు. దీని కోసం చాలా అద్భుతమైన సెట్ చేశారు. అక్కడ ఉన్న వాటితోనే ఒక ఆయుధం తయారు చేస్తారు. ఆ ఎపిసోడ్ టెర్రిఫిక్ గా వచ్చింది. ఇందులో ఇంటర్వెల్ కి ముందు వచ్చే సీక్వెన్స్ నెక్స్ట్ లెవల్ లో వుంటుందిఅన్నారు ఫైట్‌ మాస్టర్‌ వెంకట్‌.

Leave a comment

error: Content is protected !!