Devara : టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన “దేవర” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ “ఫియర్ సాంగ్” ఆదివారం సాయంత్రం విడుదలైంది. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ పాటను స్పెషల్ ట్రీట్ గా విడుదల చేశారు మేకర్స్. ఈ పాటకు అనిరుధ్ సంగీతం అందించడంతో పాటు ఆలపించి అదరగొట్టారు. రామజోగయ్య శాస్త్రి రాసిన సాహిత్యం ప్రతి లైన్ లోనూ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. నల్ల లుంగీ, నల్ల షర్టులో ఎన్టీఆర్ లుక్ అదిరిపోయేలా ఉంది. యాక్షన్ సీన్స్ తో నిండిన ఈ పాట మొత్తం మీద అద్భుతంగా ఆకట్టుకుంది.

ఈ పాట తెలుగులో రామజోగయ్య శాస్త్రి, తమిళంలో విష్ణు ఏడవన్, హిందీలో మనోజ్ ముంతాషిర్, కన్నడలో ఆజాద్ వరదరాజ్, మలయాళంలో ఎం.గోపాలకృష్ణన్ రాసినట్లు మేకర్స్ ఇప్పటికే తెలిపారు. “దేవర” సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన బీటౌన్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎన్టీఆర్ సోదరుడు, హీరో నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ బ్యానర్లపై కొరటాల శివ సన్నిహితుడు మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 10న విడుదల కానుంది.

Leave a comment

error: Content is protected !!