అల్లూరి సీతారామరాజు. తెల్లదొరలకు ముచ్చెమటలు పట్టించిన మన్యం వీరుడు. తెలుగు మూవీ లవర్స్‌కి ఈ పేరు చెప్తే గుర్తొచ్చేది సూపర్‌స్టార్ కృష్ణ. ఆయన కెరీర్‌లో ఇది వందో చిత్రం. అంతేకాదు మొట్టమొదటి తెలుగు సినిమా స్కోప్ కలర్ మూవీ కూడా ఇదే. 1973లో డిసెంబర్ 12 న షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ మూవీ ఏకధాటిగా నలభై రోజులు షూటింగ్ జరుపుకుంది. అంత కాలం ఔట్‌డోర్‌లో షూట్ చేసిన ఫస్ట్ మూవీ కూడా ఇదే. ఆయన మంచితనానికి ఎన్నో ఉదాహరణలున్నా అల్లూరి సీతారామరాజు షూటింగ్ టైమ్‌లో జరిగిన ఒక సంఘటనకు ఆయనకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.ఈ సినిమాకు డైరెక్టర్ ఓరుగంటి రామచంద్రరావు. అల్లూరి సీతారామరాజు షూట్ స్టార్టయిన దగ్గర్నుంచి ఎన్నో అడ్డంకులొచ్చాయి. షూటింగ్ స్టార్టయిన మూడో రోజున డైరెక్టర్ కు విపరీతంగా కడుపునొప్పి వచ్చి హాస్పిటల్‌లో జాయిన కావాల్సి వచ్చింది. రెండు రోజుల తర్వాత ఆయన కోలుకున్నారు. ఇలాంటి ఎన్నో అవాంతరాలు షూటింగ్‌కు అడ్డొచ్చాయి. అయినా పట్టుదలతో మూవీ షూట్ చేస్తున్నారు కృష్ణ.షూటింగ్ ఏకధాటిగా చింతపల్లి అడవుల పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. సినిమా సగం వరకు షూట్ అయిన కొద్ది రోజులకే.. డైరెక్టర్ రామచంద్రరావు హెల్త్ కండిషన్ బాగాలేక వైజాగ్‌లోని అమెరికన్ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. అక్కడ ఫలితం లేకపోవడంతో మద్రాసులోని వెల్లింగ్‌టన్ హాస్పిటల్‌లో చేర్చాల్సి వచ్చింది. కొంతకాలానికి ఆయన మరణించారు. యాక్షన్ పార్ట్ కోసం కె.ఎస్ ఆర్ దాస్ సహాయం తీసుకుని మిగతా షూట్‌ని కృష్ణ గారే కంప్లీట్ చేసారు. సినిమాని పూర్తిగా రామచంద్రరావు డైరెక్షన్ చేయకపోయినప్పటికీ ఆయన మీదున్న గౌరవంతో ఆయనకిచ్చిన మాట కోసం డైరెక్టర్‌గా ఆయన పేరే వేసారు సూపర్‌స్టార్ కృష్ణ. కృష్ణగారి మంచితనానికి మచ్చుతునకలుగా నిలిచిన సంఘటనల్లో ఇదొకటి.