Faria Abdulla : ‘మత్తు వదలరా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన దర్శకుడు రితేశ్ రానా. ఇప్పుడు ఇదే సినిమా సీక్వెల్ ‘మత్తు వదలరా 2’ మూవీ తో మరోసారి ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు. శ్రీసింహా కోడూరి, ఫరియా అబ్దుల్లా జోడీగా నటించిన మత్తు వదలరా 2 సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా టీజర్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో ఘనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో శ్రీసింహా మాట్లాడుతూ, మొదటి భాగానికి ప్రేక్షకులు చూపించిన అపారమైన ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమాను చూడలేకపోయిన వారి కోసం మరింత ఎక్కువ వినోదంతో నిండిన ఈ సినిమాను రూపొందించామని తెలిపారు. హీరోయిన్  ఫరియా అబ్దుల్లా ఈ సినిమా కోసం ఒక పాటను రాయడమే కాకుండా, ఆ పాటకు నృత్యరీతులు కూడా అందించారు. దర్శకుడు రితేశ్ రానా, ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

Leave a comment

error: Content is protected !!