Vettaiyan : సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ దర్శకత్వంలోని భారీ ప్రాజెక్ట్ ‘కూలీ’ లో నటిస్తున్నారు . దీనితో పాటు తలైవా.. టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘వేట్టైయన్’ అనే మరో యాక్షన్ మూవీలోనూ నటిస్తున్నారు.

ప్రస్తుతం ‘వేట్టైయన్’ షూటింగ్ పూర్తి కాగా, ఈ సినిమా ఇప్పుడు డబ్బింగ్ దశకు చేరుకుంది. ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న మలయాళ విలక్షణ నటుడు ఫహద్ ఫాసిల్ డబ్బింగ్ ప్రారంభించాడు. మూవీ టీమ్ .. దానికి సంబంధించిన ఫోటోను షేర్ చేశారు.

ఈ భారీ చిత్రంలో అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, దుషార విజయన్, రితికా సింగ్, జీయమ్ సుందర్, రోహిణి, ఇంకా రావు రమేష్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ‘వేట్టైయన్’ మూవీ అక్టోబర్ 10, తెలుగుతో సహా పలు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

Leave a comment

error: Content is protected !!