Fahad Fazil :  ఆవేశం భారీ హిట్ తర్వాత ఫహద్ ఫాసిల్ అద్భుతమైన దశను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్లకు పైగా వసూలు చేసింది, ఇది మలయాళ పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. నటనతో పాటు, ఫహద్ ఫాసిల్ నిర్మాత కూడా. అతను నిర్మించిన ప్రేమలు మూవీ సంచలనం సృష్టించింది.

ఇదిలా ఉంటే.. రజనీకాంత్ కూలీ మూవీ కోసం దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో తిరిగి వర్క్ చేయబోతున్నాడు ఫహద్. ఈ ఇద్దరూ ఇంతకు ముందు ఇండస్ట్రీ హిట్ విక్రమ్ కోసం పనిచేశారు. ఫహద్ నటన అందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కూలీ షూటింగ్ జూలై 1న ప్రారంభం కానుంది. సత్యరాజ్, శృతి హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్ పుష్ప 2లో ఫహద్ ఫాసిల్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రం ఆగస్టు 15, 2024న ప్రేక్షకుల ముందుకు రానుంది. పుష్ప 2తో పాటు, ఆక్సిజన్, డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ చిత్రాల్లో కూడా ఫహద్ పని చేస్తున్నాడు.

Leave a comment

error: Content is protected !!