Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ ‘పుష్ప: ది రూల్’ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 6న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లోకి రాబోతోంది. కాగా.. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న ఫహద్ ఫాజిల్ కుు సంబంధించిన కొత్త పోస్టర్‌ను గురువారం ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు.

ఈ పోస్టర్‌లో ఫహాద్ ఫాజిల్ గల్ల లుంగీ ధరించి, ఒక చేతిలో గన్‌తో, మరో చేతిలో గొడ్డలితో భయంకరంగా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఫహద్ ఫాజిల్ పోస్టర్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతడి అగ్రెసివ్ లుక్ ప్రేక్షకులను భలేగా ఆకట్టుకుంటోది. ఇప్పటి వరకు విడుదలైన టీజర్‌, పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం చిత్రం షూటింగ్‌ చాలా వేగంగా జరుగుతోంది.

ముఖ్యంగా పతాక సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయని చెబుతున్నారు. ఈ సన్నివేశాలు చిత్రానికి హైలైట్‌గా నిలవబోతున్నాయని చిత్ర యూనిట్‌ తెలిపింది. ‘పుష్ప-2’ చిత్రం ప్రేక్షకుల అంచనాలను మించి విజయం సాధించబోతుందని అంచనా వేస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!