Fahad Fazil : అల్లు అర్జున్ నటించిన “పుష్ప: ది రైజ్” సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్ గా “పుష్ప: ది రూల్” అనే సినిమాను శరవేగంగా తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ సుకుమార్. మొదటి భాగంలో ఫహాద్ ఫాజిల్ భన్వర్ సింగ్ షెకావత్ అనే పోలీస్ పాత్రలో నటించాడు. ఈ సినిమాలో ఫహాద్ పాత్ర చాలా నెగెటివ్ షేడ్స్ తో ఉండటం వల్ల ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సెకండ్ పార్ట్ లో ఆ పాత్ర మరింతగా క్రూరత్వాన్ని ప్రదర్శించబోతోంది. అందుకే ఫహాద్ పాత్ర మరింత పెద్దదిగా ఉండనుంది.

ఈ సినిమా కోసం ఫహాద్ తన డేట్స్ ను కేటాయించాడు. జూన్ 1 నుండి రెండు వారాల పాటు ఫహాద్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడట. ఈ షెడ్యూల్ లో ఫహాద్ కు సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. దీంతో ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అవుతుందని సమాచారం. “పుష్ప: ది రూల్” సినిమా ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల కానుంది.

Leave a comment

error: Content is protected !!