చిత్రం: ఎఫ్ 3
నటి నటులు: వెంకటేష్ దగ్గుబాటి, కొణిదెల వరుణ్ తేజ్,  తమన్నా భాటియా, మెహ్రిన్, పూజా హెగ్డే,  రాజేంద్ర ప్రసాద్, సునీల్, అలీ,  సోనాల్ చౌహన్, రఘు బాబు
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్
ఎడిటర్: తమ్మిరాజు
నిర్మాత: దిల్ రాజు
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
రచన, దర్శకత్వం:అనిల్ రావిపూడి

దగ్గుబాటి వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరో లు గా ఎన్నో ఎక్సపెక్టేషన్స్ తో వచ్చిన సక్సెస్ ఫుల్ ఫ్రాంఛైజ్ “ఎఫ్ 3”.
అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్‌2 చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద షేక్ చేసింది.‘పటాస్’ మూవీ నుంచే కామెడీని హ్యాండిల్ చేయడంలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని తన మార్క్ డైలాగ్ లతో, వరుస విజయాలను అందుకుంటున్నారు అనిల్ రావిపూడి. స్టార్ ప్రొడ్యూజర్ దిల్ రాజు కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో మల్టీ స్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ఫస్ట్ టైమ్ సీక్వెల్ గా రావడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా భారీ విడుదలకు సిద్దమైన ఈ సినిమా ఫై భారీ అంచనాలు ఉన్నాయి. ఫ్యామిలీ & ఫన్ ఎంటర్టైన్మెంట్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులిని అలరించిందో లేదో తెలుసుకుందాం…!!

కథ:

వెంకీ (షార్ట్ కట్ సర్వీసెస్) షార్ట్ కట్ లో డబ్బులు సంపాదించడానికి ప్లాన్ చేస్తుంటాడు. వెంకీ కి  రఘు బాబు కూడ తోడవుతాడు. ఒకరోజు తమన్నా ఫ్యామిలీ  కుకింగ్  టాలెంట్ చూసిన వెంకీ & రఘు బాబు, ఎంతో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెట్టి రెస్టారెంట్ ఓపెన్ చేయిస్తాడు. కానీ, అది ఓపినింగ్ రోజే మూతబడిపోతుంది.  వెంకీ ఆ అమౌంట్ ని రికవరి చేయడానికి తమన్నా ఫ్యామిలీ నుంచి చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ గ్యాప్ లో వరుణ్ తేజ్, డబ్బున్న అమ్మాయిని పడేసే ప్రయత్నంలో మెహ్రిన్ కి చాలా ఖర్చులు పెడుతుంటాడు. ఈ ఖర్చంతా, వెంకీ & రఘు బాబు ఇల్లు తాకట్టు పెట్టి, ఆలీ దగ్గర నుంచి అమౌంట్ తీసుకొని ఇస్తాడు. ఆ డబ్బంతా ఖర్చు పెట్టింది తమన్నా సొంత చెల్లి అని తెలుసుకొని మల్లి మోసపోతారు. ఈ ఫ్రష్టేషన్ తట్టుకోలేక పెద్ద దిక్కు గా ఎస్ ఐ రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వెళ్తారు. ఎంతో నిజాయతి గల పోలీస్ ఆఫీసర్ గా పేరున్న రాజేంద్ర ప్రసాద్ సడెన్ గా అవినీతి కి పాల్పుడతాడు. ఆ అవినీతి లో అందరు పాలుపంచుకుంటే, అందరికి డబ్బు దక్కుతుంది. అసలు ఆ ప్లాన్ ఏంటి? ఆ ప్లాన్ వల్ల వాళ్ళ జీవితాలు ఎలా మారాయి? 

కధనం, విశ్లేషణ:

ప్రతి ప్రేక్షకుడు వెంకటేష్ నుంచి ఎటువంటి కామిడి కోరుకుంటారో, అలాంటి రేంజ్ కామిడి టైమింగ్ తో, రేచీకటి క్యారెక్టర్ లో కడుపు చెక్కలైయేలా నవ్వించారు. ముఖ్యంగా ఈ సినిమాలో డబ్బు తో కూడిన ఫ్రష్టేషన్ కి గురి అయ్యే సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి. నిజ జీవితంలో వరుణ్ తేజ్ కి కామెడీ సినిమాలు పెద్దగా ఇంటరెస్ట్ లేకపొయ్యినప్పటికీ ఎఫ్2 కన్నా,ఎఫ్3 లో రక రకాల గెటప్స్ తో చాలా మెచ్యూర్డు గా  యాక్టింగ్  చేసారు.  ముఖ్యంగా తన నత్తి తో కడుపుబ్బా డ్యాన్స్ ఆడిస్తాడు. ఎప్పుడు చూడని విధంగా తమన్నా ని ఈ సినిమాలో చూస్తారు. మెహ్రిన్ ఎప్పటి లాగే అలరించింది. ముఖ్యంగా పూజ హెగ్డే “లైఫ్ అంటే ఇట్టా ఉండాలా” సాంగ్‌లో గ్లామర్ షో తో కనువిందు చేసింది. వెన్నెల కిషోర్ కామెడీ సీక్వెన్స్ పీక్స్ లో ఉంది.ఇక అందాల ఆరబోతలో సోనాల్ చౌహాన్ ఇరగదీస్తోంది. కిడ్స్ ని బేస్ చేసుకొని టాయ్స్ సీక్వెన్స్ పిల్లలని బాగా ఆకట్టుకుంటుంది.  క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ & హీరో లు వేసే గెటప్ లు ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటాయి. బుల్ ఫైట్ సీక్వెన్స్ ఐతే మూవీ కే హైలెట్. 

ఫస్టాఫ్‌ యావరేజ్‌గా ఉంటుంది. మొదటి 15 నిమిషాలు సాగదీతగా అనిపిస్తుంది. సోనాల్ చౌహాన్ వచ్చే సీన్స్ ఇంకా బలంగా రాసుకొని ఉంటె బాగుండేది. కానీ సెకండాఫ్‌లో మాత్రం కామెడీ అదిరిపోయిన, కొన్ని సన్నివేశాలు సరిగ్గా వర్కౌట్ అవ్వలేదనే చెప్పాలి. సినిమాలో కొన్ని సీన్స్ విషయం లో ఇంకా శ్రద్ధ తీసుకొని ఉంటే, ఎఫ్3 మరింత ఫన్ గా ఉండేది. 

నటి నటుల పెర్ఫామెన్స్:

రెండేళ్ల గ్యాప్ తరువాత వెంకటేష్ ఈ సినిమా లో సరి కొత్త క్యారెక్టర్ తో ఫ్యామిలీ ఆడియెన్స్ ని అలరిస్తాడు. వరుణ్ తేజ్ కామెడీ మునపటి కన్నా చాలా మెచ్యూర్డ్ గా యాక్టింగ్ కనిపిస్తుంది. మెహరీన్ తమ నటనతో పాటు తమ గ్లామర్ తోనూ ఆకట్టుకున్నారు. తమన్నా ఎప్పటిలాగే బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చింది. అలాగే సినిమాలో కీలక పాత్రలో కనిపించిన సోనాల్ చొహాన్ పెర్ఫామెన్స్, సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. మురళి శర్మ సీన్స్ చాలా ఎమోషనల్ గా తీర్చి దిద్దారు. కామెడి కింగ్ రాజేంద్ర ప్రసాద్ తనదైన  హావభావాలతో అమాయకంగా భలే నవ్విస్తాడు. సీనియర్ నటులు అలీ, సునీల్, రఘు బాబు, వెన్నెల కిషోర్, పృథ్వి రాజ్ తది తరులు తమ నటనతో మెప్పిస్తారు.

సాంకేతిక విభాగం:

ఎఫ్ 2 కన్న, ఎఫ్ 3 మూవీ ఫ్యామిలీ ఆడియెన్స్ మరింత ఓన్ చేసుకునేలా భిన్నంగా తీర్చిద్దాడు డైరెక్టర్. కొన్ని చోట్ల తడబడిన సినిమా ని బ్యాలెన్స్ చేయగలిగాడు “అనిల్ రావిపూడి”. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు అనిపించింది. డీఓపీ సాయి శ్రీరామ్ సినిమా మొత్తాన్ని చాలా కలర్ ఫుల్ గా చూపించారు. ఎడిటర్ తమ్మిరాజు వర్క్ బాగున్నప్పటికీ ఇంకా ట్రిమ్ చేసుంటే బాగుండు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఏ మాత్రం తీసిపోకుండా దిల్ రాజు & శిరీష్ చాలా గ్రాండియర్ గా చేసారు. 

రేటింగ్: 3/5

బాటమ్ లైన్: నవ్వుల పండగ “ఎఫ్ 3”

Review – Tirumalasetty Venkatesh

మూవీ వాల్యూం ఎఫ్3 పబ్లిక్ పోల్

 

Leave a comment

error: Content is protected !!