సుస్వాగతం. పవన్ కళ్యాణ్‌ను యూత్‌కు బాగా దగ్గర చేసిన సినిమా ఇది. ఈ సినిమా తండ్రి కొడుకుల సెంటిమెంట్ ప్రధానంగా సాగే యూత్‌పుల్ ఎంటర్‌టైనర్. ఒకప్పుడు తండ్రి అంటే కొడుకులకు విపరీతమైన భయం, భక్తి, గౌరవం వుండేది. సినిమాల్లోనూ అలాగే ప్రొజెక్ట్ చేసేవారు. అయితే సుస్వాగతం లో మాత్రం ఫ్రెండ్స్‌లాంటి తండ్రీ కొడుకుల క్యారెక్టరైజేషన్ ఆడియెన్స్‌ను విపరీతంగా ఎట్రాక్ట్ చేసింది.సుస్వాగతం లో పవన్ కళ్యాణ్ తండ్రి క్యారెక్టర్ లో రఘువరన్ నటించారు. విలక్షణ నటుడు రఘువరన్ కంప్లీట్ పాజిటివ్ రోల్ చేసిన మూవీ ఇది. ఈ సినిమా హైలెట్‌లోరఘువరన్ కూడా ఒకరు. అయితే ఇదే రఘవరన్ ప్లేస్‌లో లెజెండ్, అందాల నటుడు శోభన్ బాబు నటిస్తే ఎలా ఉండేది ?ఎస్.. యాక్చువల్‌గా సుస్వాగతంలో తండ్రి క్యారెక్టర్ కోసం మొదట శోభన్ బాబునే అడిగారట. గతంలో చిరు, శోభన్‌బాబు కాంబినేషన్‌లో సినిమాలు వచ్చాయి. ఇప్పుడు పవన్ కు తండ్రిగా శోభన్ బాబు నటిస్తే బాగుంటుందన్న ఐడియాను వర్కవుట్ చేయడం కోసం నిర్మాత ఆర్‌బి చౌదరి శోభన్‌బాబు ను కలిసి అడిగారట. అప్పటికే సినిమాలనుంచి రిటైర్ అయిన శోభన్‌బాబు ఇక మేకప్ వేసుకోకూడదని స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యానని చెప్పి సున్నితంగా తిరస్కరించారట. అలా సోగ్గాడు చేయాల్సిన సుస్వాగతం తండ్రి క్యారెక్టర్ .. విలనీ రోల్స్‌తో విలక్షణ నటుడనిపించుకున్న రఘువరన్‌కు దక్కింది.