దేశ విదేశాలకు చెందిన అద్భుతమైన మొక్కలన్నీ ఒకే చోట దర్శనమిచ్చే ఓ అరుదైన సుందరమైన పార్క్ తెలంగాణా రాష్ట్రంలో ప్రారంభం కావడం విశేషం. అదే చిలుకూరులోని ప్రొద్దుటూరు వెస్ట్రన్ సెంటర్‌లో ప్రారంభమైన ‘ఎక్స్‌పీరియం పార్క్’. ఈ పార్క్‌ను మెగాస్టార్ చిరు చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
ప్రముఖ వ్యాపారవేత్త మాడుగుల రాందేవ్ ఈ ఎక్స్‌పీరియం పార్క్‌ను అద్భుతంగా నిర్మించారు. దేశ విదేశాల నుంచి మొక్కలు తెప్పించి అరుదైన అద్భుతమైన పార్క్‌ను తీర్చిదిద్దారు. ఓ రకంగా చూస్తే రాందేవ్ బిజినెస్ మేన్ కాదు చక్కని ఆర్టిస్ట్,వారి కళా హృదయం ఈ పార్క్‌లో కనిపిస్తుందన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇంత పెద్ద ల్యాండ్ ఉంటే రియల్ ఎస్టేట్ చేస్తారు కానీ రాందేవ్ మాత్రం పర్యావరణాన్ని కాపాడుతున్నారని కొనియాడురు చిరు. రాందేవ్ తో తనకున్న సుదీర్ఘ పరిచయాన్ని చిరు గుర్తు చేసుకున్నారు. తన ఇంటిలోని కొన్ని మొక్కలను రాందేవ్ తనకు పంపించారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో చిరు, సీఎం రేవంత్‌రెడ్డితో పాటు తెలంగాణా టూరిజం శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు, మరో ముఖ్య అతిథిగా సీఎం రమేష్ హాజరయ్యారు.
