Shopping Cart 0 items - $0.00 0

మణిరత్నం మూవీ రిజెక్ట్ చేసిన వెంకీ?

 

ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ గ‌ర్వించ‌ద‌గ్గ గొప్ప డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం. ఈయన చేసిన సినిమాల్లో వ‌న్ ఆఫ్ ది బ్లాక్ బ‌స్ట‌ర్ రోజా. ఇందులో అర‌వింద్ స్వామి, మధుబాల మెయిన్ లీడ్‌. ఈ మూవీ తెలుగు త‌మిళ హిందీ భాష‌ల్లో భారీ హిట్ అయ్యింది. అంతేకాదు ఈ మూవీతోనే ఎఆర్ ర‌హ‌మాన్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ కి ప‌రిచ‌యం అయ్యాడు. ఇంత‌టి అద్భుత‌మైన మూవీలో హీరోగా ఆఫ‌ర్ వ‌స్తే ఎవ‌రైనా వ‌దులుకుంటారా.? కానీ మ‌న టాలీవుడ్ వ‌న్ ఆఫ్ ది టాప్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ మాత్రం నో చెప్పాడట‌. ఇది ఆశ్చ‌ర్యం క‌లిగించే అంశ‌మే అయినా నిజం. వెంక‌టేష్ ఈ సినిమా ఆఫ‌ర్‌ను స్మూత్‌గా రిజెక్ట్ చేసాడ‌ట.రోజా మూవీలో హీరోగా చెయ్య‌మ‌ని మ‌ణిర‌త్నం నుంచి వెంక‌టేష్ కు ఆఫర్ వ‌చ్చింది. ఆ టైమ్‌లో కొన్ని వ‌రుస సినిమాల‌తో బిజీగా వుండ‌టం వ‌ల‌న వెంక‌టేష్ నో చెప్పాల్సి వ‌చ్చింది. సో ఆ విధంగా రోజాలో న‌టించే ఓ గోల్డెన్ ఛాన్స్‌ను మిస్స‌య్యాడు.

Leave a comment

error: Content is protected !!