Shopping Cart 0 items - $0.00 0

ఎవడైతే నాకేంటి?

 

యాంగ్రీ మేన్ రాజశేఖర్ నటించిన పొలిటికల్ మూవీస్ లో చెప్పుకోదగ్గ సినిమా ‘ఎవడైతే నాకేంటి?’. వి.సముద్ర, జీవిత సంయుక్త దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 9, 2007లో విడుదలై ఘన విజయం సాధించింది. హీరో తండ్రి అవినీతిపరుడైన విద్యాశాఖామాత్యుడు. తన అల్లుళ్ళకు వేరు వేరు  ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించి.. వారి అరాచకాలకు కొమ్ము కాస్తూ ఉంటాడు. అయితే తండ్రి అవినీతి , అక్రమాల్ని సహించలేని అతడి కొడుకు (హీరో).. తండ్రి మీదే పోటీ చేసి.. మినిస్టరై.. ఆయన ఇగో మీద దెబ్బకొడతాడు. చివరికి అతడు తన తండ్రిని మంచి మార్గంలోకి ఎలా తెచ్చుకున్నాడు అన్నదే సినిమా కథాంశం. ఇక ఈ సినిమాలో కథానాయికగా సంవృతా సునీల్ అనే మలయాళ భామ నటించింది. తండ్రిగా రఘువరన్ నటించగా.. కళాభవన్ మణి, గిరిబాబు, కృష్ణ భగవాన్, దేవరాజ్, ఝాన్సీ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.నిజానికి ఈ సినిమా మలయాళంలో దిలీప్ హీరోగా సూపర్ హిట్టైన ‘లయన్’ చిత్రానికి రీమేక్ వెర్షన్. మలయాళం సినిమాలోని సన్నివేశాల్ని .. తెలుగు సినిమాకోసం యాజిటీజ్ తీసుకున్నా.. క్లైమాక్స్ మాత్రం తమిళ చిత్రం విజయ్ నటించిన ‘మధురై’ చిత్రం నుంచి తీసుకున్నారు.

 

Leave a comment

error: Content is protected !!