RC 16 : మూడు సంవత్సరాలుగా రూపొందుతున్న రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌పై అభిమానులు అసహనానికి లోనవుతున్నారు. ఆ సినిమా విడుదల గురించి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అలాగే.. మరో వైపు .. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాపై ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ చిత్రం షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కాబోతోంది. షూటింగ్ కోసం భారీ విలేజ్ సెట్‌ను వేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ సెట్ చాలా భారీగా ఉంటుందని టాక్. ఈ సెట్లోనే 60 శాతం షూటింగ్ జరుగబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిచబోతున్నారు. ఈ సినిమాలో ఈ సెట్ అతి ముఖ్యమైనది కాబట్టి.. భారీ ఖర్చుకు వెనుకడుగు వేయడం లేదు.
జాన్వీ కపూర్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది . ఆమె రామ్ చరణ్‌తో రొమాన్స్ చేయడం ఇదే మొదటిసారి. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

Leave a comment

error: Content is protected !!