ఈ వయసులో నాక్కావల్సింది అబద్దాలు, నిజాలు కావు జ్ఞాపకాలు.. అతడు సినిమా క్లైమాక్స్‌లో నాజర్ చెప్పిన డైలాగ్ ఇది. పార్ధు తాత క్యారెక్టర్‌లో నాజర్ ఇచ్చిన సెటిల్డ్పర్‌ఫార్మెన్స్ కు నూటికి నూరు మార్కులు ఇవ్వాల్సిందే. అయితే ఈ క్యారెక్టర్ మరో లెజెండ్రీ ఆర్టిస్ట్ పోషించాల్సింది. విషయంలోకి వెళ్తే పరుగు ఆపడం ఒక కళ.. ఈ కళ బాగా తెలిసిన నటుడు శోభన్ బాబు. విపరీతమైన లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ శోభన్‌బాబు. అప్పట్లో శోభన్ బాబు రింగ్ అంటూ హెయిర్ స్టయిల్ బాగా పాపులర్ అయ్యింది. చాలా మంది కుర్రాళ్లు ఆ హెయిర్ స్టైల్‌ను ఫాలో అయ్యేవారంటే శోభన్‌బాబు రింగ్ పాపులారిటీ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇన్ని స్పెషాలిటీస్ ఉన్న శోభన్ బాబు దొరబాబు మూవీ తర్వాత నటించడం మానేసారు. చాలా కాలం తర్వాత అతడు సినిమాలో యాక్ట్ చేయించాలనే ఆలోచన ఆ చిత్ర దర్శకుడు త్రివిక్రమ్‌కు వచ్చిందట. నిర్మాత మురళీ మోహన్ ఆయన్ను కలిసి యాక్ట్ చేయమని రిక్వెస్ట్ చేసారట. అందుకు బ్లాంక్ చెక్ ఆఫర్ కూడా చేసారట. కానీ శోభన్బాబు ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించారట. లేదంటే జ్ఞాపకాలు నెమరు వేసుకునే హుందాయైన ఇంటి పెద్దగా నాజర్ ప్లేస్‌లో శోభన్‌బాబు కనిపించేవారు. అతడు సినిమా హిట్ మహేష్ బాబుతో సమానంగా క్రెడిట్ దక్కించుకునేవారనడంలో అతిశయోక్తి లేదు.