Maa Nanna Superhero : నైట్రో హీరో సుధీర్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘మా నాన్న సూపర్ హీరో’. ఈ చిత్రం షూటింగ్ పూర్తయి ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఇటీవల విడుదలైన టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తండ్రీ కొడుకుల మధ్య సాగే ఎమోషనల్ బాండింగ్‌ ఈ చిత్ర కథాంశం.

సుధీర్ బాబు తన కొత్త అవతారంలో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. సాయి చంద్, షాయాజీ షిండే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా నుండి ‘నాన్న’ అనే ఎమోషనల్ సాంగ్ సెప్టెంబర్ 19న విడుదల కానుంది. ఈ సాంగ్ తండ్రీ కొడుకుల మధ్య బంధాన్ని మరింత బలపరుస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు.

Leave a comment

error: Content is protected !!