‘మంచుపల్లకి, సితార, ప్రేమించు పెళ్ళాడు, లేడీస్ టైలర్, చెట్టుకింద ప్లీడర్ , అన్వేషణ, ఏప్రిల్ 1విడుదల, సరదాగా కాసేపు, ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. గోపీ గోపిక గోదారి’ లాంటి అద్భుతమైన చిత్రాలు సీనియర్ డైరెక్టర్ వంశీ  దర్శకత్వ ప్రతిభకు నిదర్శనాలు. ఇక వంశీ గొప్పదర్శకుడే కాకుండా.. కదిలించే కథలు రాయడంలో కూడా ఆయన దిట్ట. ఇప్పటికే ‘మా పసలపూడి కథలు, దిగువ గోదావరి కథలు, మన్యం రాణి’ లాంటి అద్భుతమైన సీరియల్స్ తో కూడా పాఠకుల మనసుల్ని కదలించారు ఆయన. ప్రస్తుతం ఒక వారపత్రికలో తన సినీ జీవిత విశేషాలతో ‘పొలమారిన జ్నాపకాలు’ ధారావాహిక రాస్తున్నారు.

      అలాంటి అద్భుతమైన దర్శకుడు త్వరలో రాఘవ రెడ్డి ( చిన్నా ) డైరెక్షన్ లో రాబోతున్న ఓ చిత్రానికి మ్యూజిక్ తో పాటు కధ ని కూడ అందించారు. దాదాపు 27 ఏళ్ళ తర్వాత వంశీ ఈ చిత్రానికి మ్యూజిక్ ని అందించడం ఓ విశేషం. అంతే కాకుండా తన కథ వేరే వారికి ఇవ్వడం కూడ ఇదే ప్రధమం.

 

                      డైరెక్టర్ వంశీ దగ్గర దాదాపు 15 సంవత్సరాలు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసిన రాఘవ రెడ్డి ( చిన్నా ) ఈ చిత్రం తోనే డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అనుమానాస్పదం ఫేం వనితా రెడ్డి ఇందులో మెయిన్ లీడ్ లో నటించారు. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్ లో ఆడియన్స్ ముందుకు రానుంది.

 

సాంకేతిక సిబ్బంది:

దర్శకత్వం: రాఘవ రెడ్డి ( చిన్నా )

కథ & సంగీతం : వంశీ

మాటలు : మధు శ్రీ

నిర్మాత: కర్రి సత్యశివ తేజ

DOP : రామకృష్ణ

ఎడిటర్: నాగిరెడ్డి 

Leave a comment

error: Content is protected !!