హైదరాబాద్‌: నగరంలోని ప్రముఖ షాపింగ్ హబ్ శరత్ సిటీ మాల్ (AMB Mall కొండాపూర్‌)లో వింధ్య గోల్డ్ (Viindya Gold) – సిల్వర్ బార్ ఛాలెంజ్‌ ఈవెంట్ కు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఈషా రెబ్బ హాజరై సందడి చేశారు. మే 23న ప్రారంభమైన ఈ ఈవెంట్ 25వ తేదీ వరకు కొన‌సాగుతుంది.

ఈ సందర్భంగా హీరోయిన్ ఈషా రెబ్బ మాట్లాడుతూ, “బంగారం లాంటి వేడుక ఇది. ఈవెంట్ చాలా గ్రాండ్ గా కలర్ ఫుల్ గా ఉంది. ఈ తరహా వినూత్న ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్కరికి మరిచిపోలేని అనుభూతినిస్తాయి. వింధ్య గోల్డ్‌ వంటి నమ్మకమైన బ్రాండ్‌ నిర్వహిస్తుండటంతో మరింత విశ్వసనీయంగా అనిపిస్తోంది. వింధ్య గోల్డ్ పర్చేజ్ ప్లాన్ భవిష్యత్ కు బంగారు భరోసా లాంటిది అని” అని అన్నారు. గోల్డ్ – సిల్వర్ బార్ ఛాలెంజ్‌లో సందర్శకులతో పాటు ఈషా రెబ్బ సంద‌డి చేసి ఉత్సాహ‌ప‌రిచారు.

ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గోల్డ్ – సిల్వర్ బార్ ఛాలెంజ్‌లో సందర్శకులు ఉత్సాహంగా పాల్గొంటూ తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఛాలెంజ్‌లో విజేతలకు బంగారు, వెండి నాణేలు బహుమతులుగా అందజేయడం ఈవెంట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ప్రతి ఒక్కరికీ నాణ్యమైన ఆభరణాల్ని అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్న వింధ్య గోల్డ్, ఈ కార్యక్రమం ద్వారా తమ బ్రాండ్ విశ్వసనీయతను మరింత బలోపేతం చేసింది. భారీ సంఖ్యలో సందర్శకులు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయగా, నిర్వాహకులు పాల్గొన్న ప్ర‌తి ఒక్క‌రికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Leave a comment

error: Content is protected !!