హర్షవర్ధన్ గారి అమృతం షో నాకు చాలా ఇష్టం. అలాగే గుండెజారి గల్లంతయ్యిందే, మనం చిత్రాలలో ఆయన రైటింగ్ నాకు చాలా నచ్చుతుంది. ఈ చిత్రం కోసం ప్రొడక్షన్ టీం నుంచి సంప్రదించారు. హర్షవర్ధన్ గారు డైరెక్టర్ గా చేస్తున్నారని చాలా అనందంగా అనిపించింది. ఐతే ఇందులో విశాలాక్షి పాత్రకు నేను అయితే బావుంటుందని సుధీర్ బాబు గారు నాపేరు సజెస్ట్ చేశారని తెలిసి చాలా ఆనందం అనిపించిందిఅన్నారు హీరోయిన్ ఈషారెబ్బ. మామా మశ్చీంద్రలో ఫీమేల్ లీడ్ చేస్తున్న ఈషారెబ్బ.. అక్టోబర్‌ 6 న ఈ చిత్రం రిలీజ్‌ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో సినిమా విశేషాలను పంచుకున్నారు.

సుధీర్‌ బాబు, ఈషారెబ్బ కాంబినేషన్‌లో యాక్టర్‌ కమ్ రైటర్ హర్షవర్ధన్‌ డైరెక్షన్‌లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌ నిర్మిస్తున్న చిత్రమే మామా మశ్చీంద్ర‘.

ఈ చిత్రంలో ప్రతీ పదినిమిషాలకో సర్‌ప్రైజ్‌ ఉంటుందన్నారు ఈషారెబ్బ. రైటరే డైరెక్టర్ కావడం వల్ల ప్రతీ పాత్రకు ప్రాధాన్యత కల్పిస్తూ.. చాలా క్లారిటీగా తీసారన్నారు.

సుధీర్‌ బాబు చాలా కొత్తగా కనిపిస్తారని.. దుర్గా గెటప్‌లో సెట్స్‌ కు వచ్చినపుడు గుర్తుపట్టలేకపోయానని, విషయం తెలిసాక ఆశ్చర్యపోయానన్నారు. ఈ చిత్రం మంచి ఎక్స్‌పీరియెన్స్‌ ఇచ్చిందన్నారు. దయా వెబ్‌సిరీస్‌ 2 సీజన్ , తమిళ్ లో విక్రమ్‌ ప్రభు తో చేస్తున్నట్టు చెప్పారు ఈషారెబ్బ.

Leave a comment

error: Content is protected !!