చిత్రం : ఈ కథలో పాత్రలు కల్పితం

నటీనటులు : పవన్‌ తేజ్‌, మేఘన, పృద్వి, రఘుబాబు, నవీన్, అభయ్, సింగర్ నోయెల్ తదితరులు

బ్యానర్ : ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్

సంగీతం: కార్తీక్‌ కొడకండ్ల

ఎడిటింగ్‌: శ్రీకాంత్‌ పట్నాయక్‌. ఆర్‌- తిరు

సినిమాటోగ్రఫీ: సునీల్‌ కుమార్‌.ఎన్‌

డైలాగ్స్ అండ్ ఎడిషినల్ స్క్రీన్‌ప్లే: తాజుద్దీన్‌ సయ్యద్‌

క‌థ-స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: అభిరామ్ ఎమ్‌

నిర్మాత: రాజేష్‌ నాయుడు

విడుదల తేది : 26-03-2021

కొణిదెల ఫ్యామిలీ నుండి పవన్ తేజ్ కొణిదెల హీరోగా పరిచయమవుతూ తెరకెక్కిన చిత్రం ‘ఈ కథలో పాత్రలు కల్పితం’. కొత్త తరహా కథతో తెరకెక్కిన ఈ సినిమాతో హీరోగా ఎటువంటి క్రేజ్ తెచ్చుకునే ప్రయత్నం చేసాడు. కొత్త దర్శకుడు అభిరామ్ తెరకెక్కించిన ఈ కథలో పాత్రలు ఎలా కల్పితం, అసలు ఏమి జరిగిందనేది సినిమా రివ్యూలో చూద్దాం…

కథ :

కృష్ణ (పవన్ తేజ్) హీరోగా ప్రయత్నాలు చేస్తుంటాడు. తన ఫ్రెండ్ నవీన్ ప్రముఖ ప్రొడ్యూసర్ రియల్ రత్నం (రఘుబాబు) దగ్గర ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేస్తుంటాడు. హీరోగా ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో అప్పటికే ఓ హీరోయిన్ గా నటిస్తున్న శృతి (మేఘన కుమార్)ని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. తరువాత వారిద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది. ఇలా హ్యాపీగా సాగిపోతున్న క్రమంలో కృష్ణ కు హీరోగా ఛాన్స్ వస్తుంది. ఆ సినిమా కథ ఓ పాపులర్ మోడల్ రియల్ కథతో జరుగుతుంది. ఆ పాపులర్ మోడల్ జీవితం నేరమయం అవ్వడంతో ఏసిపి (ప్రిద్వి) అన్వేషణ సాగిస్తుంటాడు. ఇంతకీ అసలు ఆ మోడల్ ఎవరు ? ఆమె వెనకున్న కథేమిది ? ఇంతకీ హీరో అవ్వాలనుకున్న కృష్ణ ఎందుకు ఆ మోడల్ విషయంలో ఎక్కువ ఆసక్తినికనపరుస్తాడు లాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథ విశ్లేషణ :

ఓ సస్పెన్స్ కథను ఎంటర్ టైనేమేంట్ వే లో చెప్పి ఆ కథలోని ట్విస్ట్ లను ఒక్కొక్కటిగా విప్పుతూ కథను నడపడం బాగుంది. దర్శకుడు తాను ఎంచుకున్న కథను బాగా డీల్ చేసాడు. ముఖ్యంగా  నేడు సమాజంలో జరుగుతున్నా విమెన్ ట్రాఫికింగ్ ను ఎంచుకుని దాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించిన విధానం బాగుంది.

నటీనటుల పెర్ఫార్మెన్స్ :

తొలి సినిమా అవ్వడంతో పవన్ తేజ్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేసాడు. అతని బాడీ లాంగ్వేజ్, స్టైల్, డైలాగ్స్ అన్ని బాగున్నాయి. ఇక హీరోయిన్ మేఘన గ్లామర్ సినిమాకు ప్రధాన ఆకర్షణ. అందం, అభినయం తో మేఘన కుర్రకారును తన ప్రేమలో పడేసింది. ఇక ఏ సిపి గా పృద్వి ఆకట్టుకున్నాడు. చాలా కాలం తర్వాత తన ఒరిజినల్ వాయిస్ తో చేయడం బాగుంది. అలాగే రియల్ రత్నం పాత్రలో రఘుబాబు తనదైన కామెడీతో ఆకట్టుకున్నాడు. ఇక మిగతా పాత్రల్లో నవీన్, అభయ్ చక్కగా చేసారు.. ముక్యంగా నెగిటివ్ పాత్రలో సింగర్ నోయల్ నటన బాగుంది.

సాంకేతిక విభాగం :

ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందించిన సునీల్‌ కుమార్  కెమెరా ప్రధాన ఆకర్షణ అని చెప్పాలి, చాలా సీన్స్ చాలా అందంగా చూపించారు. ఇక సంగీతం అందించిన కార్తీక్‌ కొడకండ్ల సాంగ్స్ తో పాటు ఆర్ ఆర్ తో అదరగొట్టాడు. ఇక ఎడిటింగ్ అందించిన శ్రీకాంత్‌ పట్నాయక్, ఆర్ తీరు ల పనితీరు బాగుంది. ఎక్కడ బోర్ కొట్టే సీన్స్ లేకుండా జాగ్రత్త పడ్డారు.

ఈ చిత్రానికి క‌థ-స్క్రీన్‌ప్లే- దర్శకత్వం వహించిన కొత్త దర్శకుడు అభిరామ్ ఎమ్‌ గురించి చెప్పాలంటే .. ఓ ఆసక్తికరమైన కథను ఎంచుకుని దానికి సినిమాటిక్ డ్రామాతో ఓ సస్పెన్సు థ్రిల్లర్ కథని బాగా డీల్ చేసాడు. సినిమాలో వచ్చే ట్విస్టులన్నీ ఆకట్టుకుంటాయి. ముక్యంగా హీరో పాత్రను చివరి వరకు అతను హీరోగా ప్రయత్నాలు కాదు ఇంకేదో ఉందని హైడ్ చేయడం సినిమాకు బాగా హైలెట్ అయింది. స్క్రీన్‌ప్లే డైలాగ్స్ ఇచ్చిన తాజుద్దీన్‌ సయ్యద్ మంచి ప్రయత్నం చేసాడు. ఇకనిర్మాత రాజేష్‌ నాయుడు నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరిగా : ప్రేక్షకుడు ఊహించే కల్పితాలున్న సినిమా

రేటింగ్ : 3/5

Leave a comment

error: Content is protected !!