నటీనటులు: రవితేజ కావ్య థాపర్ అనుపమ పరమేశ్వరన్ వినయ్ రాయ్ నవదీప్శ్రీనివాస్ అవసరాలమధుబాల నవదీప్ శ్రీనివాసరెడ్డి అజయ్ ఘోష్ తదితరులు సంగీతం: డేవ్ జాండ్

ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని కర్మ్ చావ్లా కామిల్ ప్లాకి

కథ: కార్తీక్ ఘట్టమనేని మాటలు: మణిబాబు

కరణం స్క్రీన్ ప్లే: కార్తీక్ ఘట్టమనేని మణిబాబు కరణం

నిర్మాత: టి. జి. విశ్వప్రసాద్

దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని

రవితేజ డిఫరెంట్ గెటప్‌లో టీజర్, ట్రైలర్‌ లతో హై ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేసిన మూవీ ఈగల్‌. హాలీవుడ్ రేంజ్ యాక్షన్‌ సీక్వెన్స్‌తో బాక్సాఫీస్‌ రికార్డ్స్‌ విధ్వంసమే అన్నట్టుగా సాగిన హైప్‌ ని ఈగల్ అందుకుందా లేదా ? రవితేజకు బ్లాక్‌బస్టర్‌ ఇవ్వబోతుందా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం.

కథ : ఢిల్లీలో ఓ పత్రికలో నళిని (అనుపమా పరమేశ్వరన్‌) జర్నలిస్ట్‌గా పనిచేస్తుంటుంది. తాను అనుకోకుండా చూసిన ఓ చేనేత వస్త్రం ప్రాముఖ్యత గురించి తెలుసుకుని పేపర్లో రాస్తుంది. ఎక్కడో ఓ మూలన చిన్న బాక్స్‌లో పడిన ఆ ఐటమ్‌ దేశ రక్షణ వ్యవస్థలో ఉన్న పెద్దలను అలెర్ట్ అయ్యేలా చేస్తుంది. ప్రధానమంత్రి ఆఫీస్‌నుంచి సైతం పత్రికాఫీస్‌కు ఫోన్‌ కాల్స్ వచ్చేంతగా ఆ చేనత వస్త్రం ప్రభావితం చేస్తుంది. ఇంటిలిజెన్స్‌ నళిని ఇంటరాగేట్ చేసి క్లీన్‌ చిట్ ఇస్తుంది. కానీ కంపెనీ మాత్రం ఆమెను ఉధ్యోగం నుంచి తీసేస్తుంది. అసలు కథ అప్పటినుంచే మొదలవుతుంది. నళిని చేసే ఇన్విస్టిగేషన్‌లో ఆ చేనేత వస్త్రాన్ని నేసే పత్తి చాలా అరుదైనదనీ.. అది పండించే గిరిజన జాతి వెనుక దేవుడులాంటి ఓ వ్యక్తి సహదేవ్‌ (రవితేజ) ఉన్నాడని తెలుసుకుంటుంది. కానీ అనూహ్యంగా రంగంలోకి రా, ఆర్మీ, టెర్రరిస్ట్‌లు, మావోయిస్టులు రవితేజ చేనేత ఇండస్ట్రీ ఉన్న ఫార్మహౌజ్‌ మీదకు దాడికి వస్తారు. అప్పుడే తెలుస్తుంది అది ఫార్మ్‌హౌజ్‌ కాదు అత్యాధునిక ఆయుధాలున్న ఓ గోడౌన్‌ అని. అక్కడున్న ప్రతీ వస్తువు ఓ ఆయుధమేనని. ఎవరైనా అక్కడ అడుగుపెడితే జరిగేది విధ్వంసమేనని. కాటన్ ఇండస్ట్రీ నడిపే సహదేవ్ కొన్ని దేశాలకు మోస్ట్‌ వాంటెడ్ ఎలా అయ్యాడు.? ఎందుకు టార్గెట్ అయ్యాడు..? అతని లక్ష్యం ఏంటి ? రచన (కావ్య థాపర్‌) పాత్ర ఏంటి ? అనేది తెరమీద చూడాల్సిందే.

విశ్లేషణ: హీరో జీవితంలోకి ఓ అమ్మాయి ఎంటర్‌ కావడం.. ఆ అమ్మాయి కారణంగా హీరోలో మంచి మార్పురావడం.. అనుకోకుండా హీరోయిన్‌ ముష్కరుల చేతిలో బలవడం.. వారిపై హీరో రివేంజ్ తీర్చుకోవడం అనేది చాలా సినిమాల్లో చూసాం. అయితే ఈ సినిమాల్లో ముష్కరులపై కాకుండా.. అందుకు కారణమయ్యే పరిస్థితులపై హీరో రివేంజ్ తీర్చుకుంటాడు. తనకు తనవారికి మాత్రమే కాకుండా.. ప్రపంచంలో జరుగుతున్న దారుణాలకు కారణమయ్యే అక్రమ ఆయుధాల వ్యవస్థపై యుద్దం చేస్తాడు. ఆ యుద్దం తాలూకు ఎఫెక్ట్ ఓ విస్ఫోటనంలా ఉంటుందని చూపించడంలో కార్తీక్ ఘట్టమనేని టీమ్‌ కంప్లీట్ గా సక్సెస్‌ అయ్యాడు. హీరో ఎక్కడున్నా తన చుట్టూ పరిసరాలు, పరిస్థితులు తన కంట్రోల్‌ లో ఉండేలా.. ఎవరెవరు అనుసరిస్తున్నారో.. వెంబడిస్తున్నారో అంతా తెలిసిపోయేలా ఉంటాయి. మిగతా పాత్రధారులు ఆర్మీ, టెర్రిరిస్టులు, మావోయిస్టుల, జర్నలిస్ట్‌ నళిని ఇలా అంతా సహదేవ్ ముందు తేలిపోతారు. ఫస్టాఫ్‌లో హీరో గురించి నళిని తెలుసుకునే క్రమంలో మిగతా ఆర్టిస్టులు ఇచ్చే బిల్డప్‌ రియాక్షన్స్ కు తగ్గ రేంజ్‌లో మాత్రం తర్వాత కథనం ఉండకపోవడం కాస్త మైనస్‌ గా అనిపిస్తుంది. హీరో పవర్‌ను పరిచయం చేసే క్రమంలో వచ్చే యాక్షన్‌ సీన్స్‌తో ఫస్టాఫ్‌ నిండిపోతుంది.

సెకండాఫ్ కు చేరిన కథలో హీరో చుట్టు ఉదయించిన ప్రశ్నలన్నింటినీ రివీల్ చేసే సీన్స్ బాగుంటాయి. కాంట్రాక్ట్ కిల్లర్‌గా ఉన్న సహదేవ్‌ కి రచన కనిపించడం కనిపించకుండానే ఆమెతో లవ్‌ట్రాక్ నడిపే విధానం కొత్తగా ప్రజెంట్ చేసాడు. ఈ ఎపిసోడ్‌లో వారి కమ్యూనికేషన్‌కి గన్ను వాడటం డిపరెంట్‌. ఓ ఎటాక్‌లో రచన దుండగుల దాడిలో మరణించడంఆ ఆయుధాల రవాణాకు తానే సహకరించిన నేపథ్యం ఉండటంతో.. విధ్వంసాన్ని ఆపడానికి తాను గన్ను వాడాల్సిన పరిస్థితి వస్తుంది. అధముల చేతిలో ఆయుధం ఎంత ప్రమాదమో తెలిసేలా సాగే కథనం క్లైమాక్స్‌ వరకు ఆకట్టుకుంటుంది.

నటీనటులు : రవితేజకు ఇలాంటి సినిమాలు కొట్టినపిండే. కాకపోతే తన మార్క్‌ ఎంటర్‌టైన్‌మెంట్ , కామెడీ కాకుండా సీరియస్‌గా , సెటిల్డ్ గా పర్‌ఫార్మ్‌ చేసే పాత్ర ఇది. రవితేజ విజృంభించడానికి యాక్షన్‌ సీన్స్‌ తప్ప యాక్టింగ్ స్కోప్‌ ఉన్న సీన్స్‌ లేకుండా పోయాయి. అనుపమా జర్నలిస్ట్ పాత్రలో మెప్పించింది. హీరోకు సపోర్ట్ గా నవదీప్‌ బాగా నటించాడు. అజయ్‌ ఘోష్‌, శ్రీనివాసరెడ్డి ఉన్నంతలో నవ్వించారు. అవసరాల శ్రీనివాస్‌, మధుబాల పరిధి మేరకు నటించారు.

టెక్నిషియన్స్‌ : కార్తీక్‌ ఘట్టమనేని రాసుకున్న కథ, ఎంచుకున్న పాయింట్ అద్భుతంగా ఉంటుంది. యాక్షన్‌ సీన్స్‌,ఈగల్‌ అనే టైటిల్‌కు జస్టిఫై అయ్యేలా హీరో క్యారెక్టర్‌ డిజైన్‌ చేసుకున్న తీరు కూడా బాగుంటుంది. అయితే మిగతా క్యారెక్టర్స్‌ హీరో పాత్ర గురించి చెప్తూ ఇచ్చిన బిల్డప్‌కు తగ్గ రేంజ్‌లో సీన్స్‌ పడకపోవడం ఒకింత మైనస్‌. కరణం మణిబాబు చాలా డెప్త్‌ ఉన్న డైలాగ్స్‌ రాసాడు. సెకండాఫ్ నుంచి స్క్రీన్‌ప్లే మ్యాజిక్‌ చేసారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ ఈ సినిమా కి ప్రాణం. విజువల్స్‌ అద్భుతంగా ఉన్నాయి. యాక్షన్‌ కొరియోగ్రఫీ హాలీవుడ్ రేంజ్‌లో చేసారు. పాటలు సోసో గా ఉన్నాయి. నిర్మాత టిజి విశ్వప్రసాద్‌ ఖర్చు పెట్టిన ప్రతీ రూపాయి స్క్రీన్‌ మీద కనిపించేంత రిచ్‌గా, క్వాలిటీగా తీసారు.

బోటమ్‌ లైన్‌ : స్టైలిష్‌ యాక్షన్‌ విధ్వసం .. ఈగల్‌

రేటింగ్‌ : 3 / 5

Leave a comment

error: Content is protected !!