ఆయన హీరోలు చాలా యారోగెంట్ , చాలా పెక్యులర్. గుండెల్లో టన్నుల లెక్కన ధైర్యాన్ని నింపుకొన్న వారై ఉంటారు. ఎట్ ది సేమ్ టైమ్ ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత దూరమైనా వెళతారు. ఎవరితోనైనా పెట్టుకుంటారు. ఓ లెక్కలో తిక్క వేషాలు వేసి.. విలన్స్ కు పిచ్చెక్కించే మనస్తత్వం వారిది. తన ప్రతీ సినిమాలోనూ హీరోలకు అదే కేరక్టరైజేషన్ అప్లై చేస్తుంటాడు ఆ దర్శకుడు. ఆయన పేరు పూరీ జగన్నాథ్. ఆయన ఇప్పటి వరకూ తీసిన ప్రతీ సినిమా లైన్ ఒకటే. కానీ స్కీన్ ప్లే చాలా డిఫరెంట్. అందుకే టాలీవుడ్ లో 20 ఏళ్ళుగా డైనమిక్ డైరెక్టర్ గా అప్రతిహతంగా కొనసాగుతున్నాడు.
బద్రి సినిమాతో టాలీవుడ్ లో డైరెక్టర్ గా అరంగేట్రం చేశాడు పూరీ జగన్నాథ్. ఆ సినిమాతో పవన్ కళ్యాణ్ కు పవర్ ఫుల్ స్టార్ డమ్ తెచ్చిపెట్టి.. తాను డైనమిక్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, పోకిరి, దేశముదురు, చిరుత, బుజ్జిగాడు, నేనింతే, బిజినెస్ మేన్, టెంపర్, ఇస్మార్ట్ శంకర్’ లాంటి చిత్రాలతో మాస్ జనానికి అభిమాన దర్శకుడైపోయాడు పూరీ జగన్నాథ్. వితిన్ షార్ట్ పీరియడ్ లో సినిమాను షూట్ చేసి..అనుకున్న టైమ్ లో అనుకున్నట్టుగా విడుదల చేసే దమ్మున్న దర్శకుడు పూరీ జగన్నాథ్. టాలీవుడ్ లో దర్శకుడిగా అడుగుపెట్టి .. 20 ఏళ్ళు దాటిపోతున్నా.. ఎప్పటికప్పుడు అప్డేటెడ్ అవుతోన్న ఆ డైనమిక్ డైరెక్టర్ కు 21వ వార్షిక శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.