Double Ismart : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మరో యాభై రోజుల్లో “డబుల్ ఇస్మార్ట్” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కావ్య థాపర్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నాడు . ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కాబోతోంది. ప్రస్తుతం చిత్ర టీం హైదరాబాద్ లో టైటిల్ సాంగ్ షూటింగ్ లో బిజీగా ఉంది. ఈ పాటకు మణిశర్మ సంగీతం సమకూర్చగా, జానీ మాస్టర్ నృత్య రీతులు సమకూర్చారు.

మాస్ అంశాలతో నిండిన ఈ చిత్రం పూరి జగన్నాథ్- రామ్ పోతినేని కాంబినేషన్ కు తగ్గట్టుగా పూర్తి కమర్షియల్ ఫార్మేట్ లో ఉంటుంది. టైటిల్ సాంగ్ లో రామ్ పోతినేని అద్భుతమైన నృత్యాలు, అద్భుతమైన విజువల్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి . ఈ పాట త్వరలోనే విడుదల కాబోతోంది అని చిత్ర యూనిట్ తెలిపింది. “డబుల్ ఇస్మార్ట్” మూవీ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా విడుదల కానుంది. ఈ చిత్రానికి సామ్ కె. నాయుడు, జియాని జియాన్నెలి లు ఛాయాగ్రహణం వహించగా, మణిశర్మ సంగీతం సమకూర్చారు.

Leave a comment

error: Content is protected !!