Double Ismart teaser : టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న “డబుల్ ఇస్మార్ట్” సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. 2019లో బాక్సాఫీస్ ను షేక్ చేసిన “ఇస్మార్ట్ శంకర్” కి సీక్వెల్ గా వస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. హీరో రామ్ పుట్టినరోజు సందర్భంగా డబుల్ ఇస్మార్ట్ టీజర్ ను రిలీజ్ చేసి మరోసారి అభిమానులను ఉత్తేజపరిచారు మేకర్స్. రామ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిస్తూ బుధవారం ఉదయం టీజర్ ను విడుదల చేశారు. రామ్ పాత్రకు “ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్” అంటూ టీజర్ లో పరిచయం చేశారు.

పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. పూరి టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరితో పాటు హీరోయిన్ ఛార్మి ఈ చిత్రానికి నిర్మాతలుగా ఉన్నారు. రామ్ పోతినేని సరసన కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాపై రామ్- పూరి భారీ ఆశలు పెట్టుకున్నారు. హిట్ కొట్టాలని చూస్తున్న ఈ ఇద్దరి కాంబో మరోసారి విజయం సాధిస్తుందా అనేది చూడాలి.

Leave a comment

error: Content is protected !!