Double Ismart : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన “డబుల్ ఇస్మార్ట్” చిత్రం ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా చిత్రం “ఇస్మార్ట్ శంకర్” కు సీక్వెల్ గా రూపొందింది. ఈ చిత్రంలో రామ్‌కు జోడిగా కావ్య థాపర్ నటించగా, సంజయ్ దత్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. మణిశర్మ సంగీతం, సామ్‌ కె.నాయుడు సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

ఇంక ‘డబుబ్ ఇస్మార్ట్’ చిత్రం .. డబుల్ డోస్ యాక్షన్, డ్రామా, ఎంటర్‌టైన్‌మెంట్‌ తో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేయనుంది. ఇది రామ్ పోతినేని కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. యాక్షన్, డ్రామా, ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ చిత్రం ఖచ్చితంగా నచ్చుతుందని భావిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!