Amazon Prime video : అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లేటెస్ట్ గా ‘యాంగ్రీ యంగ్ మెన్’ అనే సిరీస్ ను ప్రకటించింది. బాలీవుడ్ దిగ్గజ రచయిత ద్వయం సలీం ఖాన్, జావేద్ అక్తర్ సినీ ప్రస్థానానికి సంబంధించిన ఒక అద్భుతమైన డాక్యుసీరీస్ ఇది . ఈ మూడు-భాగాల సిరీస్ 1970లలో బాలీవుడ్ ను విప్లవాత్మకంగా మార్చిన సలీం-జావేద్ సినీ జెర్నీపై సమగ్రమైన ఇన్ఫర్మేషన్ ను అందిస్తుంది.

బాలీవుడ్ లో సలీమ్ అండ్ జావేద్ .. అప్పట్లో ఒక సంచలనం. యాంగ్రీ యంగ్ మెన్ అనేది 1970లలో షోలే, జంజీర్, దీవార్, యాదోన్ కీ బారాత్, డాన్ వంటి కొన్ని అతిపెద్ద బాలీవుడ్ బ్లాక్‌బస్టర్‌ల వెనుక ఉన్న సంగతుల్ని ఈ స్క్రీన్ రైటింగ్ ద్వయం ఈ సిరీస్ లో వివరిస్తారు. దీనిని సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్, ఎక్సెల్ మీడియా & ఎంటర్‌టైన్‌మెంట్ , టైగర్ బేబీ నిర్మించారు. ఈ నెల 20 నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది. సలీమ్ అండ్ జావేద్ సృష్టించిన ఆ స్ర్కిప్ట్స్ .. తెలుగులోనూ రీమేక్స్ గా వచ్చి ఇక్కడా జనాదరణ పొందాయి.

Leave a comment

error: Content is protected !!