దీపక్ కొలిపాక దర్శకత్వంలో గౌరీశ్ యేలేటి, రోషిణి, ప్రాచీ ఠక్కర్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఓ కల’. లక్ష్మీ నవ్య మోటూరు, రంజిత్ కుమార్ కొడాలి నిర్మిస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ను తాజాగా నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. ఎటిర్నిటి ఎంటర్‪టైన్‪మెంట్, అహం అస్మి ఫిల్మ్స్ బ్యానర్ల ద్వారా ఏప్రిల్ 13 నుంచి ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో విడుదల కానుంది.

ఓ కల చిత్రం అనేది ఓ సోషియో లవ్‌ డ్రామా. చిన్నపిల్లలతో సహా ప్రతి ఒక్కరూ ఎంజాయ్‌ చేసే చిత్రమిది. ఈ చిత్రంలోని సన్నివేశాలు చాలా మంది నిజజీవితాలకు దగ్గరగా ఉంటుంది. ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం గుర్తుండిపోతుంది. ప్రొడ్యూసర్‌ మహేష్‌కి ఇది మొదటి చిత్రం. రెండవ చిత్రం కూడా షూటింగ్‌ మొత్తం పూర్తయి విడుదలకి సిద్ధంగా ఉంది.

ఫిల్మి ఛాంబర్‌ ప్రెసిడెంట్‌ దామోదర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ: మొదటి చిత్రం కొత్తవాళ్ళతో తీయడం గొప్పకాదు అది విడుదల చేయడం చాలా కష్టం. థియేటర్‌లో విడుదలయ్యాక కలెక్షన్స్‌ రాకపోతే నష్టపోకుండా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ కూడా మరో దారి అనుకోవాలి. కానీ చాలా మంది అది తెలియక రెండు ప్లాట్‌ఫామ్స్‌లో డబ్బులు దండుకోవచ్చు అనుకుంటారు. ప్రొడ్యూసర్‌ మహేష్‌ నాకు మంచి ఫ్రెండ్‌. ఈ సినిమా మహేష్ కి మంచి విజయం కావాలని కోరుకుంటున్నాను.

Leave a comment

error: Content is protected !!